
అమరావతి: మూడేళ్లలో ప్రభుత్వం నుంచి ప్రజలు అందుకున్న లబ్ధిని, సంక్షేమాన్ని ఇంటింటికి వెళ్లి చెప్పండని ‘గడపగడపకు మన ప్రభుత్వం’ పేరుతో వైసీపీ నాయకులను, కార్యకర్తలను ప్రభుత్వం రంగంలోకి దింపింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ప్రజాప్రతినిధులను, నేతలను ప్రజల నిలదీస్తున్నారు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి (MLA JC Prabhakar Reddy) స్పందించారు. వైసీపీ వైఫల్యం చెందింది కాబట్టే గడపగడప అంటోందని ఎద్దేవాచేశారు. గడపగడపకు వెళ్తే రాళ్లతో కొట్టే రోజులు త్వరలో వస్తాయని హెచ్చరించారు. వైసీపీ పాలనలో గుడికి వెళ్లేందుకు కూడా అనుమతి తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని విమర్శించారు. వైసీపీ నేతల బస్సు యాత్రకు పోలీసుల పహారా పెట్టుకోవాలని పేర్కొన్నారు. ప్రజలు రాళ్లు వేస్తారు.. వైసీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. త్వరలో మాజీ కాల్వ శ్రీనివాస్‌తో కలిసి వెంకటరమణస్వామి ఆలయానికి వస్తానని జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రకటించారు.
ఇవి కూడా చదవండి