కారం మంచిదే!

ABN , First Publish Date - 2020-11-22T05:40:59+05:30 IST

కూర రుచిగా ఉండాలంటే కారం సరిపోనూ ఉండాల్సిందే. స్పైసీగా ఉంటేనే టేస్ట్‌ అదుర్స్‌ అంటాం. మరి కారం ఆరోగ్యానికి మంచిదా? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కారం మన ఆహారంలో భాగంగా ఉంది. తాజా పరిశోధనలో సైతం ఆరోగ్యంగా ఉండటానికి కారం ఉపయోగపడుతుందని గుర్తించారు...

కారం మంచిదే!

కూర రుచిగా ఉండాలంటే కారం సరిపోనూ ఉండాల్సిందే. స్పైసీగా ఉంటేనే టేస్ట్‌ అదుర్స్‌ అంటాం. మరి కారం ఆరోగ్యానికి మంచిదా? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కారం మన ఆహారంలో భాగంగా ఉంది. తాజా పరిశోధనలో సైతం ఆరోగ్యంగా ఉండటానికి కారం ఉపయోగపడుతుందని గుర్తించారు. మిర్చిలో కాప్సైసిన్‌ అనే పదార్థం ఉంటుంది. మిర్చి తిన్నప్పుడు కాప్సైసిన్‌ పదార్థం శరీరంలోని టెంపరేచర్‌ రెసిప్టార్స్‌తో అనుసంధానం అయి మెదడుకు సంకేతాలు పంపిస్తుంది.

ఈ పదార్థం మనిషి ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడుతున్నట్టు ఇటలీలో నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడయింది. మిర్చి తినని వారితో పోలిస్తే వారంలో నాలుగు రోజులు మిర్చి తిన్నవారు ఆరోగ్యంగా ఉన్నట్టు గుర్తించారు. అంతేకాకుండా శ్వాససంబంధ సమస్యలు, గుండెజబ్బులు, కేన్సర్‌ వంటి జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గినట్టు తేల్చారు. కాప్సైసిన్‌ జీవక్రియల రేటును కూడా మెరుగుపరుస్తుందని పరిశోధకులు వెల్లడించారు. అధిక రక్తపోటు సమస్య ఉన్న వారికి కూడా మిర్చి మేలు చేస్తుందని గుర్తించారు. 

Updated Date - 2020-11-22T05:40:59+05:30 IST