నిరంతర యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం

ABN , First Publish Date - 2021-06-22T04:16:41+05:30 IST

ప్రతీ ఒక్కరు ఆరోగ్యంగా జీవించాలంటే రోజు యోగా సాధన చేయాలని, యోగా ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని కలెక్టర్‌ భారతి హొళికేరి అన్నారు. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో వాసవిక్లబ్‌, అష్టోత్తర యోగా పీఠ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని యోగాసనాలు వేశారు.

నిరంతర యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
యోగాదినోత్సవం సందర్భంగా ఆసనాలు వేస్తున్న కలెక్టర్‌ భారతి హొళికేరి, ఎమ్మెల్యే దివాకర్‌రావు

కలెక్టర్‌ భారతి హొళికేరి  

ఏసీసీ, జూన్‌ 21: ప్రతీ ఒక్కరు ఆరోగ్యంగా జీవించాలంటే రోజు యోగా సాధన చేయాలని, యోగా ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని కలెక్టర్‌ భారతి హొళికేరి అన్నారు. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో వాసవిక్లబ్‌, అష్టోత్తర యోగా పీఠ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యోగాసాధన వల్ల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలన్నారు. ఎమ్మె ల్యే నడిపెల్లి దివాకర్‌రావు మాట్లాడుతూ యోగా వల్ల అనేక అనారోగ్య సమస్యలు నయమవుతాయని, శారీరక రుగ్మతలు, మానసిక ఒత్తిళ్ళ నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. అష్టోత్తర యోగా గురువు గుండా విజయ్‌కుమార్‌ను సత్కరించారు. మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజ య్య, వైస్‌చైర్మన్‌ ముఖేష్‌గౌడ్‌, వాసవిక్లబ్‌ ఇంటర్నేషనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేష్‌, అష్టోత్తర యోగా ఫీఠ్‌ సభ్యులు ముక్తా వేణు, కోలేటి రవి పాల్గొన్నారు. కాలేజీ రోడ్డులో గల ఏకలవ్య ఆశ్రమంలో యోగా గురువు శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.  ముదిగుంట ప్రభుత్వ పాఠశాల విద్యార్థిను లు వేసిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి.  ఒడ్నాల లక్ష్మినారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌, వెంకటేశ్వర్‌, కృష్ణ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. 

బెల్లంపల్లి:  అంతర్జాతీయ యోగా దినోత్సవం సం దర్భంగా మైత్రేయ యోగా కమిటీ ఆధ్వర్యంలో నెంబర్‌ 2 మైదానంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మె ల్యే దుర్గం చిన్నయ్య హాజరై యోగాసనాలు వేశారు.  యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంద న్నారు.  కన్నాల సెక్టార్‌ పరిధిలోని 25 అంగన్‌వాడీ కేం ద్రాల్లో యోగా దినోత్సవం నిర్వహించినట్లు అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ మమత తెలిపారు.  

Updated Date - 2021-06-22T04:16:41+05:30 IST