నిర్భయంగా విధులు నిర్వర్తించండి

ABN , First Publish Date - 2021-07-27T06:32:49+05:30 IST

పోలీసు శాఖ మీ వెన్నంటే ఉం టుంది... నిర్భయంగా విధులు నిర్వర్తించండి అంటూ తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ వెంకటఅప్పలనాయుడు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులకు సూచించారు.

నిర్భయంగా విధులు నిర్వర్తించండి
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మహిళా సంరక్షణ కార్యదర్శులతో మాట్లాడుతున్న ఎస్పీ వెంకటఅప్పలనాయుడు

మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఎస్పీ సూచన


తిరుపతి(నేరవిభాగం), జూలై 26: పోలీసు శాఖ మీ వెన్నంటే ఉం టుంది... నిర్భయంగా విధులు నిర్వర్తించండి అంటూ తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ వెంకటఅప్పలనాయుడు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులకు సూచించారు. సోమవారం ఆయన వీడియో కాన్పరెన్స్‌ ద్వారా తన కార్యా లయం నుంచి మహిళా సంరక్షణ కార్యదర్శులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారివారి ప్రాంతాల్లోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మహిళా పోలీసులుగా సంరక్షణ కార్యదర్శులు నిర్వర్తించాల్సిన విధులను వారికి వివరించారు. క్షేత్రస్థాయిలో మహిళల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత సంరక్షణ కార్యదర్శులపైనే ఉందన్నారు. వారి విధి నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా పోలీసు శాఖ తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జిల్లాలోని అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, మహిళా పోలీసులు ఈ వీడియో కాన్పరెన్స్‌లో పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T06:32:49+05:30 IST