బాధ్యతాయుతంగా విధులు నిర్వహించండి

May 8 2021 @ 23:32PM
నరసన్నపేట: అధికారులతో మాట్లాడుతున్న జేసీ శ్రీనివాసులు

జేసీ శ్రీనివాసులు 

నరసన్నపేట, మే 8: కరోనా నివారణకు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని జేసీ శ్రీనివాసులు సూచించారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఫీవర్‌ సర్వే సక్రమంగా నిర్వహించి కరోనా పరీక్షలను చేపట్టడం ద్వారా ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చన్నారు. సచివాలయ సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలన్నారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులపై దృష్టి సారించి వారి కి వైద్య పరీక్షలు చేయించాలన్నారు. గ్రామాల్లో కేసులు పెరు గుతున్నందున ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. సమావేశంలో మండల ప్రత్యేకాధికారి ఆర్వీ రామన్‌, తహసీల్దార్‌ కె.ప్రవల్లిక ప్రియ, ఇన్‌చార్జి ఎంపీడీవో రమేష్‌కుమార్‌ తది తరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో కరోనా కలకలంతో సిబ్బంది భయభ్రాంతులకు లోనవు తున్నారు. రెండు రోజులు కిందట ఎంపీడీవోకు కరోనా పాజిటివ్‌ రాగా శనివారం ఏవో, సీనియర్‌ అసిస్టెంట్లకు పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి. దీంతో మిగిలిన సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. 


జ్వరాల పరీక్షలు చేయండి

మందస: గ్రామాల్లో జ్వరాల సర్వే నిర్వహించాలని, పరీక్షల సంఖ్య పెంచాలని టెక్కలి సబ్‌కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ గనోరే తెలిపారు. మందస తహసీల్దార్‌ కార్యా లయంలో శనివారం వైద్యాధి కారులు, వైద్యసిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పాజిటివ్‌ వచ్చిన వారికి ఐసోలేషన్‌ కిట్లు అందించాలని, అవసరమైన వారికి ఆసుపత్రికి పంపిం చాలన్నారు. సమావేశంలో తహసీల్దార్‌ బి.పాపారావు, ఎంపీడీవో తిరుమలరావు, ప్రత్యేకాధికారి ము రళీకృష్ణ, వైద్యులు రమేష్‌కుమార్‌, సంపత్‌, ఆర్‌ఐ రామకృష్ణ పాల్గొ న్నారు. 


కరోనాతో ఇద్దరు వ్యాపారుల మృతి

పలాస: పలాస-కాశీబుగ్గ జంటపట్టణాలకు చెందిన ఇద్దరు వ్యాపారులు కరోనా బారినపడడంతో చికిత్సపొందు తూ శనివారం మృతిచెందారని తహసీల్దార్‌ మధు సూదనరావు తెలిపారు. వీరిలో ఒకరు ప్రముఖ హోటల్‌ నిర్వా హకుడు కావడంతో హోటళ్లు బంద్‌ పాటించాయి. మరో  బియ్యం వ్యాపారి మృతి చెందడంతో ఆ ప్రాంతంలో కంటై న్మెంట్‌ జోన్‌ ఏర్పాటు చేశారు. ఆయన నివాసముంటున్న ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలో ఐదుగురు మృతిచెందడం తో అధికారులు అప్రమత్తమయ్యారు.


పాతపట్నంలో ఇద్దరు...

మెళియాపుట్టి (పాతపట్నం): మండలంలో శనివా రం 41 కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయని తహ సీల్దార్‌ ఎం.కాళీప్రసాద్‌ తెలిపారు. మండలంలో 24 కంటె ౖన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇదిలా ఉండగా శనివారం మండలంలో ఇద్దరు కరోనాతో మృతి చెందినట్లు చెప్పా రు. స్థానిక గాయత్రీనగర్‌కు చెందిన పొందూరు నరసింహులు (64), లాబర గ్రామానికి చెందిన వీరంశెట్టి ఎల్లమ్మ (65) రాగోలు జెమ్స్‌లో చికిత్సపొందుతూ మృతి చెందారన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు చెప్పారు.

 


 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.