సమర్థవంతంగా విధులు నిర్వహించాలి: ఎస్పీ

ABN , First Publish Date - 2021-10-27T05:25:58+05:30 IST

నేరాలను అరికట్టేందుకు విధులు సమర్థవంతంగా నిర్వహించాలని ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో నేర సమావేశం నిర్వహించారు.

సమర్థవంతంగా విధులు నిర్వహించాలి: ఎస్పీ

కర్నూలు, అక్టోబరు 26: నేరాలను అరికట్టేందుకు విధులు సమర్థవంతంగా నిర్వహించాలని ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో నేర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హత్య కేసులు, మహిళలపై జరిగే నేరాలను ఎస్పీ రివ్యూ చేశారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌, ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌, ఆర్‌ఈఎల్‌ రిపోర్టుల వివరాలను త్వరగా తెప్పించుకోవాలని ఆదేశించారు. అన్ని కేసుల దర్యాప్తుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సమీక్షలో సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ తుహిన సిన్హా, డీఎస్పీలు మహేశ్వరరెడ్డి, వెంకటాద్రి, వెంకట్రామయ్య, ఎ.రాజేంద్ర, చిదానందరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రమణ, రామాంజి నాయక్‌, శ్రీనివాసులు, యుగంధర్‌బాబు, కేవీ మహేష్‌, శృతి, సీఐలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-27T05:25:58+05:30 IST