వాట్సాప్‌ నుంచి పీరియడ్స్‌ ట్రాకర్‌

ABN , First Publish Date - 2022-07-02T09:00:03+05:30 IST

మహిళల ఆరోగ్యం అంతకు మించి జీవితంలో అతి ముఖ్యమైన విషయాల్లో ఒకటైన రుతుచక్రం, అండోత్పాదన తదితరాలను ట్రాక్‌ చేసే చాట్‌బోట్‌కు వాట్సాప్‌ శ్రీకారం చుట్టింది.

వాట్సాప్‌ నుంచి పీరియడ్స్‌ ట్రాకర్‌

మహిళల ఆరోగ్యం అంతకు మించి జీవితంలో అతి ముఖ్యమైన విషయాల్లో ఒకటైన రుతుచక్రం, అండోత్పాదన తదితరాలను ట్రాక్‌ చేసే చాట్‌బోట్‌కు వాట్సాప్‌ శ్రీకారం చుట్టింది. మహిళలకు సంబంధించి హైజీన్‌ ఉత్పత్తుల్లో ఇండియన్‌ బ్రాండ్‌ ‘సిరోనా’ సహకారంతో వాట్సాప్‌ ఈ చాట్‌బోట్‌ను నిర్వహిస్తోంది. నిజానికి గూగుల్‌ ప్లేస్టోర్‌లో సంబంధిత ట్రాకింగ్‌ యాప్స్‌ చాలానే ఉన్నాయి. అయితే వాట్సాప్‌ అందించే ఈ సదుపాయం కోసం అదనంగా ఎలాంటి యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే దీంట్లో మహిళల ఆరోగ్యంపై ఎడ్యుకేషనల్‌ కంటెంట్‌, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌, ఇన్‌బిల్ట్‌ పీరియడ్‌ ట్రాకర్‌ ఉంటాయి. ఇక్కడ చేయాల్సింది ఒక్కటే. 919718866644 నెంబర్‌కి హాయ్‌ చెప్పడం ద్వారా ట్రాకర్‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు. ఇందులో మూడు ఆప్షన్లు ఉంటాయి. ట్రాక్‌ పీరియడ్స్‌, కన్సీవ్‌(గర్భధారణ), గర్భం వద్దనుకోవడం అనే మూడూ ఉంటాయి. ప్రతీది బేసిక్‌ వివరాలతో ఉంటుంది. చాట్‌బోట్‌ తనంతట తాను రికార్డును ట్రాక్‌ చేసి ఉంచుతుంది. పీరియడ్‌ డేట్స్‌ని యాక్యురేట్‌గా ప్రిడిక్ట్‌ చేస్తుంది. ఒకసారి ఇందులోకి వెళితే చాలు, దానంతట అదే మెనుస్ట్రల్‌ సైకిల్‌ తేదీలను రిమైండ్‌ చేస్తుంది. ఓవ్యులేషన్‌ సైకిల్‌ని అప్‌డేట్‌ చేస్తుంది. షేర్‌ చేసుకున్న సమాచారాన్ని అనుసరించి మాత్రమే కచ్చితత్వం ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మెనుస్ట్రల్‌ సైకిల్‌ మార్పులు ఉంటే అంచనాలు తప్పయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. మరే కారణం చేతనైనా సైకిల్‌ డిస్ట్రబ్‌ కావచ్చు. ఆ వివరాలను జాగ్రత్తగా ఎడిట్‌ చేసుకోవాలి. తదుపరి మూడు మెనుస్ట్రేషన్‌ సైకిల్స్‌ వీక్షించేందుకు చాట్‌బోట్‌లో అందుబాటులో ఉంటాయి.

Updated Date - 2022-07-02T09:00:03+05:30 IST