Mahanaduలో జరిగేవి చర్చలా, క్యాబరేనా?: పేర్ని నాని

ABN , First Publish Date - 2022-05-28T21:17:01+05:30 IST

తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడులో జరిగేవి చర్చలా, క్యాబరేనా అని కృష్ణాజిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు.

Mahanaduలో జరిగేవి చర్చలా, క్యాబరేనా?:  పేర్ని నాని

గన్నవరం, కృష్ణాజిల్లా:  తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడులో జరిగేవి చర్చలా, క్యాబరేనా అని కృష్ణాజిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. శనివారం  ఏబీఎన్‌తో పేర్ని నాని మాట్లాడుతూ... మహానాడులో మహిళా నేతలతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌‌రెడ్డిని బూతులు తిట్టిస్తున్నారని మండిపడ్డారు.  అసలు మహానాడు నిర్వహించే అధికారం చంద్రబాబు కుటుంబానికి లేదన్నారు.సామాజిక న్యాయ భేరీని మహానాడు తేదీల్లోనే నిర్వహిస్తారనడం సమంజసం కాదన్నారు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యకమం ఫెయిల్ అయినందునే ‘బస్సు యాత్ర’ చేస్తున్నామనడం కరక్ట్‌ కాదని చెప్పారు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యకమం ఇప్పట్లో ఆగేది కాదు.. అది నిరంతర ప్రక్రియ అని పేర్నినాని అన్నారు.


కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు,  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్  డిమాండ్‌ చేయలేదా ? అని ప్రశ్నించారు.వంగవీటీ మోహన రంగా పేరు పెట్టాలనే డిమాండ్‌ను కూడా  ప్రభుత్వం పరిశీలించిందన్నారు.ఆయా అంశాలపై  ముఖ్యమంత్రి జగన్మోహన్‌‌రెడ్డి అవసరమైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.సీపీఎస్‌ ఉద్యోగులు ఇంటి ఎదుట పోస్టర్లు వేసుకోవడం సమంజసం కాదన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు వారికీ తెలుసునని చెప్పారు.అమరావతి పేరును అంబేద్కర్ నగర్‌గా మార్చాలని సీఎంని  స్వయంగా కోరానని, ఆయన ఇంకా ఎందుకో ఆలోచిస్తున్నారని తెలిపారు. కృష్ణ జిల్లాలో ఏర్పడ్డ రెండు జిల్లాల్లో ఒక దానికి వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలనే డిమాండ్‌పై మీడియా ప్రతినిధులు అడగ్గా  పేర్నినాని సమాధానం దాటవేశారు. అన్ని డిమాండ్లు పరిశీలించి సరైన సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌‌రెడ్డి  నిర్ణయం తీసుకుంటారని  పేర్నినాని సమాధానం దాటవేశారు.

Updated Date - 2022-05-28T21:17:01+05:30 IST