చిరంజీవికి నమస్కారం పెట్టని మీ సంస్కారం ఎక్కడా?: మంత్రి పేర్నినాని

ABN , First Publish Date - 2022-03-15T03:25:08+05:30 IST

చిరంజీవికి నమస్కారం పెట్టని మీ సంస్కారం ఎక్కడా?: మంత్రి పేర్నినాని

చిరంజీవికి నమస్కారం పెట్టని మీ సంస్కారం ఎక్కడా?: మంత్రి పేర్నినాని

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి పేర్నినాని కౌంటర్‌ ఇచ్చారు. చిరంజీవికి నమస్కారం పెట్టని మీ సంస్కారం ఎక్కడా?, చిరంజీవి లేకపోతే పవన్‌ ఎక్కడ ఉండేవారు? అని మంత్రి ప్రశ్నించారు. తీగలాంటి నీకు ఊతకర్రలా చిరంజీవి నిలబడ్డారని చెప్పారు. బీజేపీ, టీడీపీని కలిపే ప్రయత్నం పవన్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో మీ నిర్ణయాలతో ఏపీకి ఏం మేలు జరిగింది?, ఉద్దానంలో ఫొటో సెషన్‌తో ఏం మేలు జరిగింది? అని ప్రశ్నించారు. పవన్‌కు సినిమా డైలాగ్‌లు తప్ప ఏమీ తెలియదని విమర్శించారు. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరని పవన్‌ గుర్తించాలని ఆయన సూచించారు. చంద్రబాబుకు మేలు చేయడమే పవన్‌ లక్ష్యమన్నారు. స్పీచ్‌ పవన్‌ది..స్క్రిప్ట్‌ చంద్రబాబుదని పేర్కొన్నారు. ఏపీ ప్రయోజనాలపై కేంద్రాన్ని పవన్‌ ఎప్పుడైనా ప్రశ్నించారా? అని మంత్రి ప్రశ్నించారు. గదుల్లో ఒక మాట..గల్లీల్లో ఒక మాట అని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-03-15T03:25:08+05:30 IST