అంగారక గ్రహంపై ఆక్సిజన్!

ABN , First Publish Date - 2021-04-23T17:52:30+05:30 IST

అంగారక గ్రహం పైకి నాసా పంపించిన పర్సివరెన్స్‌ రోవర్ అద్భుతాలు చేస్తోంది.

అంగారక గ్రహంపై ఆక్సిజన్!

అంగారక గ్రహం పైకి నాసా పంపించిన పర్సివరెన్స్‌ రోవర్ అద్భుతాలు చేస్తోంది. తాజాగా కృత్రిమ ఆక్సిజన్‌ను తయారు చేసింది. భూమిపై కాకుండా మరో గ్రహంపై కృత్రిమ ఆక్సిజన్‌ను తయారు చేసిన అరుదైన ఘట్టం ఇది. మార్స్ వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్‌ను సేకరించి దాని నుంచి 5 గ్రాముల ఆక్సిజన్‌ను పర్సివరెన్స్‌ రోవర్ తయారు చేసింది. ఒక వ్యోమగామి పది నిమిషాల పాటు శ్వాసించడానికి ఈ 5 గ్రాముల ఆక్సిజన్ సరిపోతుంది. 


వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను సేకరించి దాని నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేసేందుకు పర్సివరెన్స్‌ రోవర్‌లో `మోక్సీ` అనే పరికరాన్ని అమర్చారు. ఇది వాతావరణంలోని కార్బన్‌ డయాక్సైడ్‌ను గ్రహించి, ఎలక్ట్రాలసిస్‌ ప్రక్రియ ద్వారా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలా ఉత్పత్తి అయిన ఆక్సిజన్‌ను భద్రపరుస్తుంది. ఏడు నెలల ప్రయాణం తరువాత ఫిబ్రవరి 18న అంగారక గ్రహంపై పర్సివరెన్స్ రోవర్ దిగిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2021-04-23T17:52:30+05:30 IST