వరంగల్ ఎంజీఎంలో కొవిడ్ వార్డు ఎదుట వ్యక్తి మృతి

May 11 2021 @ 12:49PM

వరంగల్ : ఎంజీఎంలో కొవిడ్ రోగుల మరణ మృదంగం కొనసాగుతోంది. వైద్యం కోసం వచ్చి బెడ్లు దొరక్క కొవిడ్ వార్డు ముందే బాధితులు చనిపోతున్న ఘటనలు హృదయాన్ని ద్రవింపజేస్తున్నాయి. నేడు కొవిడ్ వార్డు ఎదుట ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎంజీఎం సిబ్బంది అతని వివరాలను సేకరిస్తున్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.