అప్పు తిరిగి ఇవ్వలేదని బండరాయితో మోది హత్య
ABN , First Publish Date - 2022-07-06T17:53:01+05:30 IST
అప్పు తిరిగి ఇవ్వలేదని బండరాయితో దాడి చేసి హత్య చేశారు. బిక్కనూర్ మండలం లక్ష్మీ నగర్ తండాకు చెందిన జీవన్ అనే వ్యక్తి..
Kamareddy : అప్పు తిరిగి ఇవ్వలేదని బండరాయితో దాడి చేసి హత్య చేశారు. బిక్కనూర్ మండలం లక్ష్మీ నగర్ తండాకు చెందిన జీవన్ అనే వ్యక్తి తన మేనల్లుడు వినోద్ వద్ద 30 వేల అప్పు తీసుకున్నాడు. అప్పు చెల్లించకపోవడంతో జీవన్తో వినోద్ గొడవపడ్డాడు. ఘర్షణలో కింద పడ్డ జీవన్ను బండరాయితో తలపై కొట్టి వినోద్ హత్య చేశాడు. భిక్కనూర్ పోలీసులకు మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి భిక్కనూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.