కరోనా నుంచి కోలుకున్నారా..? అయితే మరుక్షణమే దీన్ని వాడటం మానేయండి..!

ABN , First Publish Date - 2021-05-23T16:46:27+05:30 IST

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. మన చుట్టుపక్కల కూడా చాలా మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ముగ్గురికి వరుసగా ఈ వైరస్ సోకడం కూడా కనిపిస్తోంది. కరోనా నుంచి ఒకసారి కోలుకొని హమ్మయ్య అనుకోవడానికి కూడా లేదు.

కరోనా నుంచి కోలుకున్నారా..? అయితే మరుక్షణమే దీన్ని వాడటం మానేయండి..!

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. మన చుట్టుపక్కల కూడా చాలా మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ముగ్గురికి వరుసగా ఈ వైరస్ సోకడం కూడా కనిపిస్తోంది. కరోనా నుంచి ఒకసారి కోలుకొని హమ్మయ్య అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే కరోనా నుంచి కోలుకున్న వారికి కూడా మరోసారి సులభంగా ఈ వైరస్ సోకుతున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఇలా కరోనా రెండోసారి సోకకుండా ఉండాలన్నా.. ఒక కరోనా పేషెంట్ వల్ల అతని కుటుంబ సభ్యులకు ఈ వైరస్ వ్యాపించకూడదన్నా ఒక సూత్రం మాత్రం కచ్చితంగా పాటించాలని డాక్టర్లు చెప్తున్నారు. అదేంటో తెలుసుకుంటే భవిష్యత్తులో చాలా కరోనా కష్టాలు రాకుండా నిలువరించవచ్చు.


ఎవరైనా సరే కరోనా సోకి చికిత్స తీసుకున్న తర్వాత కోలుకుంటే వారు వెంటనే చేయాల్సిన పని ఒకటుందని డాక్టర్లు అంటున్నారు. అది సదరు వ్యక్తి టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ మార్చుకోవడం. శాస్త్రవేత్తల ప్రకారం కరోనా సోకిన వ్యక్తి మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల వల్ల ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇది ఏదైనా వస్తువుపై చేరినా లేక గాలిలో అయినా సరే కొంత కాలం పాటు మరణించకుండా ఉంటోంది. దీని వల్ల చాలా మందికి కరోనా సోకుతోంది. ఈ క్రమంలోనే కరోనా పేషెంట్లు కోలుకోగానే టూత్‌బ్రష్, టంగ్ క్లీనర్ మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారు మరోసారి కరోనా బారిన పడకుండా ఉండటంతోపాటుగా.. ఒకే వాష్‌రూమ్ ఉపయోగించే కుటుంబ సభ్యులను కూడా కాపాడిన వారవుతారని చెప్తున్నారు.


కరోనా సోకిన సమయంలో ఉపయోగించే టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ మీద వైరస్ చేరుతుందట. ఈ వైరస్ ఆ తర్వాత ఎగువ శ్వాసనాళ సమస్యలకు దారితీస్తుంది. అందుకే కొత్త బ్రష్, టంగ్ క్లీనర్ వాడాలని, దాంతోపాటు మౌత్‌వాష్ కూడా మంచిదని డాక్టర్ల సలహా. ఒకవేళ మౌత్‌వాష్ కనుక అందుబాటులో లేకపోతే కనీసం వేడిచేసిన సెలైన్ వాటర్‌తో అయినా నోరు శుభ్రం చేసుకోవడం ఉత్తమం. అలాగే కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకితే వారి టూత్‌బ్రష్, టంగ్ క్లీనర్‌తోపాటు టవల్స్ వంటి వాటిని కూడా మిగతా వారి వస్తువులతో కలపకుండా ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా వైద్యుల సలహాను పాటించడమే మంచిదని చెప్తోంది. కరోనా సమయంలో వాడే ఈ వస్తువలపై వైరస్ కణాలు బాగా పేరుకుపోయి ఉండే ప్రమాదం ఉందని, కాబట్టి కరోనా నుంచి కోలుకోగానే వీటిని తొలగించడం మంచిదని సూచించింది. అలాగే కుదరితే కరోనా పేషెంట్లు కూడా తమ టూత్‌బ్రష్, టంగ్ క్లీనర్లను ఎప్పటికప్పుడు డిస్‌ఇన్ఫెక్ట్ చేసుకుంటే మంచిందని నిపుణుల అభిప్రాయం.

Updated Date - 2021-05-23T16:46:27+05:30 IST