వికేంద్రీకరణకు వక్రభాష్యం: సీపీఎం శ్రీనివాసరావు

ABN , First Publish Date - 2022-03-19T22:50:51+05:30 IST

వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం వక్రభాష్యాలు చెబుతోందని సీపీఎం

వికేంద్రీకరణకు వక్రభాష్యం: సీపీఎం శ్రీనివాసరావు

అమరావతి: వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం వక్రభాష్యాలు చెబుతోందని సీపీఎం నాయకులు శ్రీనివాసరావు అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో అమరావతి ప్రజాబాట ఐదవ రోజు కార్యక్రమాన్ని తుళ్లూరులో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికేంద్రీకరణ అంటే రాజధాని ముక్కలు చేయడం కాదని, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలన్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగిస్తూ, హైకోర్టు తీర్పు ప్రకారం అభివృద్ధి చేపడతామని ముఖ్యమంత్రి శాసనసభలో విస్పష్ట ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లక్ష కోట్ల రూపాయలు అవసరమైన అమరావతికి లక్ష రూపాయలను కేంద్ర బడ్జెట్లో కేటాయించి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోడీ, బీజేపీ ప్రభుత్వం అవమాన పరిచిందని ఆయన ఆరోపించారు. అమరావతి అభివృద్ధి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఉమ్మడి పోరు సాగిస్తామని ఆయన ప్రకటించారు. 

Updated Date - 2022-03-19T22:50:51+05:30 IST