పెసల ధోక్లా

ABN , First Publish Date - 2022-03-02T19:43:33+05:30 IST

పెసర్లు- 250 గ్రాములు, శెనగపిండి- 120 గ్రాములు, క్యారెట్‌- 1, పచ్చి మిరప-మూడు, జీలకర్ర పొడి- అర స్పూను, కొత్తి

పెసల ధోక్లా

కావలసిన పదార్థాలు: పెసర్లు- 250 గ్రాములు, శెనగపిండి- 120 గ్రాములు, క్యారెట్‌- 1, పచ్చి మిరప-మూడు, జీలకర్ర పొడి- అర స్పూను, కొత్తి మీర తరుగు- రెండు స్పూన్లు, ఆవాలు- అర స్పూను, పెరుగు- అర కప్పు, కరివేపాకు- రెండు రెబ్బలు, అల్లం ముక్కలు- అర స్పూను, నీళ్లు, నూనె, ఉప్పు- తగినంత.


తయారుచేసే విధానం: ఓ రాత్రంతా పెసరపప్పును నానబెట్టి రుబ్బుకోవాలి. క్యారెట్‌ ముక్కలు, అల్లం, పచ్చిమిరప, కొత్తిమీర తరుగును మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. పెసరరుబ్బుకు క్యారట్‌ పేస్టు, పెరుగు, శెనగపిండి, ఉప్పు, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ధోక్లామేకర్‌లో ఉడికిస్తే సరి. ఇది లేని వారు వెడల్పాటి గిన్నెకు నూనె రాసి అందులో పిండిని వేసి ఇడ్లీల్లా ఉడికిస్తే సరి. పైన పోపు వేసి చాకుతో కోస్తే ధోక్లాలు రెడీ. 

Updated Date - 2022-03-02T19:43:33+05:30 IST