వంటలు

పెసరపప్పు పకోడా

పెసరపప్పు పకోడా

కావలసిన పదార్థాలు: పెసరపప్పు- అర కప్పు, ఉల్లిగడ్డ ముక్కలు- కప్పు, అల్లం- ఇంచు, కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు, కారప్పొడి, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి - ఒక్కోటీ అర స్పూను, గరం మసాలా- అర స్పూను, ఇంగువ- చిటికెడు, నూనె, నీళ్లు, ఉప్పు- తగినంత.


తయారుచేసే విధానం: ముందుగా మినపప్పును నాలుగు గంటల పాటు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఓ గిన్నెలోకి ఈ మొత్తాన్ని తీసుకుని ఇందులో ఇంగువ, ఉల్లిముక్కలు, పచ్చి మిర్చి, కొత్తిమీర, అల్లం ముక్కలు, పసుపుతో పాటు మిగతా పొడులన్నీ వేసి బాగా కలిపి ఓ పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తరవాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని నూనెలో వేయించి తీస్తే పెసరపప్పు పకోడా తయార్‌.

Follow Us on:
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.