
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న దస్తగిరి తరుపున వేసిన అప్రూవర్ పిటీషన్ మరోసారి వాయిదా పడింది. కడపలోని సబ్‌కోర్టు (సీనియర్ సివిల్ జడ్జి కోర్టు)లో సోమవారం దస్తగిరి అప్రూవర్ పిటీషన్ విచారణకు వచ్చింది. సీబీఐ అధికారులు గడువు కోరడంతో జడ్జి కృష్ణన్ కుట్టి దీనిని మంగళవారానికి వాయిదావేశారు.