మాజీమంత్రి నారాయణ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్

ABN , First Publish Date - 2022-05-13T21:42:09+05:30 IST

టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో చిత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీమంత్రి నారాయణ (Narayana) బెయిల్ రద్దు చేయలని పిటిషన్ దాఖలు చేశారు

మాజీమంత్రి నారాయణ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్

చిత్తూరు: టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో చిత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీమంత్రి నారాయణ (Narayana) బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. కోర్టులో చిత్తూరు పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల తరపున కోర్టుకు హైకోర్టు ఏజీపీ సుధాకర్‌రెడ్డి హాజరైనారు. మధ్యాహ్నం వాదనలను న్యాయమూర్తి విననున్నారు. త్తూరు జిల్లాలో పదో తరగ తి తెలుగు పేపర్‌ లీకేజీపై ఏప్రిల్‌ 27న  చిత్తూరు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో మాజీ మంత్రి నారాయణను 9వ నిందితుడిగా (ఏ-9)గా చేర్చారు. మంగళవారం ఉదయం ఆయనను హైదరాబాద్‌లో అరెస్టు చేసి... చిత్తూరుకు తరలించారు. అర్ధరాత్రి తర్వాత ఆయనను మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. అనంతరం నారాయణను న్యాయమూర్తి విచారించగా తాను రాజకీయాల్లో ఉన్నందున విద్యా సంస్థలతో ఎలాంటి సంబంధమూ ఉండకూడదని రాజీనామా చేశానని చెప్పారు. దీనికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జడ్జికి అందించారు. వీటన్నింటిని పరిశీలించిన న్యాయమూర్తి రూ.లక్ష సొంత పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేశారు. ఈ నెల 18లోపు రూ.లక్షతో ఇద్దరు జామీనుదారులను కోర్టుకు హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. 

Read more