
హైదరాబాద్: High Court లో ఓయూ జేఏసీ నేతలు Petition దాఖలు చేశారు. విద్యార్థులతో కాంగ్రెస్ నేత రాహుల్ ముఖాముఖీకి అనుమతివ్వాలని కోరిన పిటిషనర్ కోరారు. ఇప్పటికే ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతి వీసీ నిరాకరించారు. ఓయూ వీసీ పక్షపతంగా వ్యవహరిస్తున్నారన్న పిటిషనర్ పేర్కొన్నారు. విద్యార్థులతో Rahul ముఖాముఖీ మాత్రమే ఉంటుందని, ఆయన ఓయూ పర్యటనలో పొలిటికల్ మీటింగ్ ఉండదని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. గతంలో ఓయూలో పొలిటికల్, నాన్ పొలిటికల్ మీటింగ్స్ జరిగాయని పిటిషనర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి