షార్‌ ప్రైవేటీకరణపై కోర్టులో కేసుకు సిద్ధం

ABN , First Publish Date - 2021-10-27T04:32:46+05:30 IST

కేంద్ర ప్రభుత్వం శ్రీహరికోట రాకెట్‌ కేంద్రాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో కేసు వేసేందుకు సిద్ధమయ్యామని శ్రీహరికోట ల్యాండ్‌లూజర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు

షార్‌ ప్రైవేటీకరణపై కోర్టులో కేసుకు సిద్ధం
విజయవాడలో విశ్రాంత ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణను కలిసిన అసోసియేష్‌ ప్రతినిధులు

శ్రీహరికోట, (సూళ్లూరుపేట) అక్టోబరు 26 : కేంద్ర ప్రభుత్వం శ్రీహరికోట రాకెట్‌ కేంద్రాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో కేసు వేసేందుకు సిద్ధమయ్యామని శ్రీహరికోట ల్యాండ్‌లూజర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. శ్రీహరికోట దీవిలో నివసించిన తాము రాకెట్‌ కేంద్రం కోసం తమ స్వస్థలాలను అప్పగించామన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం షార్‌ ప్రైవేటీకరణకు ప్రయత్నాలుచేయడం నాటి తమ త్యాగానికి అద్దంలేకుండా పోతుందని వాపోయారు. దానిపై కోర్టులో కేసు వేసేనిమిత్తం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేసిన విశ్రాంత ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణను మంగళవారం విజయవాడలో కలసి సలహాలు కోరినట్లు తెలిపారు. ఆయన సహకారంతో కోర్టులో కేసు వేస్తామని అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు ఇత్తిరెడ్డి కోదండరామ్‌, బైరి పార్థసారధిరెడ్డి తెలిపారు.

Updated Date - 2021-10-27T04:32:46+05:30 IST