వామనరావు హత్య కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్

ABN , First Publish Date - 2021-02-26T23:59:13+05:30 IST

న్యాయవాది వామనరావు హత్య కేసును సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టులో వామనరావు

వామనరావు హత్య కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్

హైదరాబాద్‌: న్యాయవాది వామనరావు హత్య కేసును సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టులో వామనరావు తండ్రి కిషన్‌రావు పిటిషన్ దాఖలు చేశారు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధు అక్రమాలు ప్రశ్నించినందుకే హత్య చేశారని కిషన్‌రావు పిటీషన్‌లో పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తుపై తమకు అనుమానాలున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే బిట్టు శ్రీను, కుంట శ్రీనులను పోలీసులు అరెస్ట్ చేశారు.


పట్టపగలే నడిరోడ్డుపై వామనరావు, నాగమణిలను దారుణంగా హత్య చేశారు. కారులో వెళ్తున్న న్యాయవాద దంపతులను దుండగులు మరో కారులో వచ్చి అడ్డుకున్నారు.. కారులోంచి న్యాయవాదిని బయటకు లాగి కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా నరికి చంపారు. కారులో ఉన్న ఆయన భార్యపైనా కత్తులతో దాడి చేసి ప్రాణాలు తీశారు. ఈ దారుణ ఘటన బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద చోటుచేసుకుంది. మంథని మండలం గుంజపడుగుకు చెందిన గట్టు వామనరావు, ఆయన భార్య నాగమణి హైకోర్టులో న్యాయవాదులుగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2021-02-26T23:59:13+05:30 IST