పెట్రోల్‌ బంకులపై నిర్వహణ భారం

ABN , First Publish Date - 2021-05-11T04:59:04+05:30 IST

కరోనా ప్రభావం పెట్రోల్‌ బంకులపైనా పడుతోంది. కార్మికుల హాజరుశాతం రోజురోజుకీ తగ్గిపోతుండటం, రోజురోజుకూ ఇంధనల ధరలు పెరుగుతుండటంతో ఇబ్బందిగా మారింది.

పెట్రోల్‌ బంకులపై నిర్వహణ భారం

  కరోనా కారణంగా విధులకు రాలేకపోతున్న కార్మికులు

  నిత్యం పెరుగుతున్న పెట్రో ధరలతో మరింత ఇబ్బందిపడుతున్న బంక్‌ యజమానులు

  అటు డీలర్లకు, ఇటు వినియోగదారులకు తప్పని భారం  

ఖమ్మం కలెక్టరేట్‌, మే10: కరోనా ప్రభావం పెట్రోల్‌ బంకులపైనా పడుతోంది. కార్మికుల హాజరుశాతం రోజురోజుకీ తగ్గిపోతుండటం, రోజురోజుకూ ఇంధనల ధరలు పెరుగుతుండటంతో ఇబ్బందిగా మారింది. కేంద్ర ప్రభుత్వం బంకుల్లో, గ్యాస్‌ సరఫరా చేసే కార్మికులకు కోవిడ్‌ వాక్సిన్‌ వేయాలని నిర్ణయించింది. దీంతో బంకుల్లో పనిచేసే కార్మికులకు కాస్త ఊరట కలుగుతోంది. ఖమ్మం జిల్లాలో దాదాపు 1300 నుంచి 15వందల మంది కార్మికు లు పని చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వారందరికీ కరోనా వాక్సిన్‌ ఇస్తే కార్మికులకు ప్రయోజనం కలగడమే కాకుండా కరోనా వ్యాప్తిని అరికట్టే ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే నిత్యం పెరుగు తున్న ధరలతో ఇటు వినియోగదారులు గగ్గోలు పెడుతుంటే.. అటు డీలర్లకు కూడా పెట్టుబడి భారం అవుతోంది. దీంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్న డీల ర్లు కరోనా ప్రభావంతో మరింత నష్టపోవాల్సి వస్తోంది.  

  జిల్లాలో 136 బంకులు 

 జిల్లాలో 136 వరకు పెట్రోల్‌బంకులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా బెంగాల్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల అనంతరం ఈనెల 3నుంచి పెట్రో ధరల వడ్డింపు కొనసాగుతోంది.   గత వారం రోజుల్లో డీజిల్‌పై రూ.1.51, పెట్రోల్‌పై రూ.1.24పైసలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయించాయి.. ఈ పెంపు వినియోగ దారులపై మరింతభారం పడనుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిుల్‌ ధరలు పెరిగిపోవడంతో పెట్రోలు ధరల పెంపు అనివార్యం అంటున్నా తగ్గించేది స్వల్పం పెంచడం మాత్రం అధికంగా ఉందంటూ వినియోగ దారులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలో 136 బంకుల ద్వారా నిత్యం 75వేల లీటర్ల పెట్రోలు, 1.50లక్షల లీటర్ల డీజిల్‌ విక్రయాలు జరుగుతున్నాయి. పెంచిన పెట్రోలు ధరలతో ప్రతి నిత్యం రూ.1,13లక్షలుపెట్రోలుపై , డీజిల్‌పై రూ.1,86లక్షల భారం పడనుంది. నెలకు పెట్రోలుపై రూ.7,09లక్షల భారం పడుతుంటే డీ జిల్‌పై రూ.12లక్షల  భారం పడుతోంది. మొత్తంగా జిల్లాలో కోటి రూపాయల పెనుభారం పెట్రో వినియోగదారులపై పడుతోంది.

  డీలర్లపైనా పెనుభారం 

జిల్లాలో 136 మంది డీలర్లు ఉన్నారు. చమురు కంపెనీలు పెంచుతున్న ధరలతో అటు వినియోగదారులు, ఇటు డీలర్లు ఆర్థికంగా నష్టపోతున్నారు. గతంలో 20వేల లీటర్ల ఆయిల్‌ ట్యాంకర్‌కు రూ.7లక్షలనుంచి రూ 10లక్షలు పెట్టుబడి పెట్టేవారు. ప్రస్తుతం అదే ట్యాంకర్‌ను రూ 17.50లక్షలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. అంటే రెట్టింపు ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇది డీలర్‌కు పెనుభారంగా మారింది. డీలర్లకు ఇచ్చే కమీషన్‌ మాత్రం రూ.1.60 పైసలు మాత్రమే ఇస్తున్నారు. ట్యాంకర్‌ ధరను పెంచుతున్న కమీషన్‌ మాత్రం పెంచడంలేదు.   దీనికి తోడు దేశవ్యాప్తంగా గతంలో  మూడు ఆయిల్‌ కంపెనీలకు చెందిన బంకులు మెత్తం 58 వేల వరకు ఉండగా ప్రస్తుతం అదనంగా మరో 75వేల బంకులను కొత్తగా మంజూరి చేసింది. దీంతో బంకుల సంఖ్య పెరిగి పోయింది. డీలర్లు పెరిగిపోయారు. పోటీతత్వం పెరిగి పోయింది. దీంతో ఆదాయం గణనీయంగా తగ్గిపోతోంది. ఒకప్పుడు లక్షల లీటర్లు విక్రయించిన డీలర్లు వేలల్లోనే విక్రయిస్తున్నారు. దీంతో వారికి వచ్చే కమీషన్‌ కూడా గణనీయంగా తగ్గిపోయిందని డీలర్లు వాపోతున్నారు. 

కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వాల్సిందే

డాక్టర్‌ నాగబత్తిని రవి, సీనియర్‌ పెట్రో డీలర్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా పెట్రోల్‌ బంకుల్లో పని చేసే సిబ్బందికి విధిగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వాల్సిందే. ప్రభుత్వ నిర్ణయం సరైనది. దీన్ని వెంటనే అమలు చేయాలి. రోజులో వందల వాహనాల యజమా నులు బంకులకు వస్తూపో తుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దమెత్తంలో కలవడం వలన పెట్రోల్‌ బంకుల్లో పనిచేసే కార్మికులు కలవర పడుతున్నారు. పెట్టుబడులు రెట్టింపు అవ్వడంతో దిక్కుతోచని స్థితిలో  పెట్రో డీలర్లు ఉన్నారు. బంకులు నిర్వహించడమే కష్టతరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు పెట్రోధరల పెంపుపై నిర్ణయాన్ని తీసుకోవాలి. 

Updated Date - 2021-05-11T04:59:04+05:30 IST