
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్ళ పెరిగాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే... ఈ పెంపు ఆరో సారి కావడం గమనార్హం. ఢిల్లీలో పెట్రోల్ ధర గతంలో రూ. 99.11 ఉండగా ఇప్పుడు లీటరుకు రూ. 99.41 కు చేరింది. ఇక వివరాల్లోకి వెళితే... సోమవారం పెట్రోలు ధర లీటరుకు 30 పైసలు, డీజిల్ ధర 35 పైసలు పెరిగాయి. కిందటి వారంలో మొత్తం ధరలు లీటరుకు రూ. 4-4.10 కు పెరిగాయి. రాష్ట్ర ఇంధన రిటైలర్ల ధర నోటిఫికేషన్ ప్రకారం... ఢిల్లీలో పెట్రోల్ ధర గతంలో రూ. 99.11 నుండి రూ. 99.41 గా ఉంది. కాగా... డీజిల్ ధరలు లీటరుకు రూ. 90.42 నుండి రూ. 90.77 కు పెరిగాయి.
మార్చి 22 న రేట్ల సవరణలో, నాలుగున్నర నెలల సుదీర్ఘ విరామం తర్వాత ధరలు పెరగడం ఇది ఆరోసారి. మొదటి నాలుగు సందర్భాల్లో, ధరలు లీటరుకు 80 పైసలు పెరిగాయి. జూన్ 2017 లో రోజువారీ ధరల సవరణను ప్రవేశపెట్టినప్పటి నుండి ఒక్క రోజులో అత్యధిక పెరుగుదల కావడం గమనార్హం. ఆదివారం పెట్రోల్ ధర లీటరుకు 50 పైసలు, డీజిల్ ధర 55 పైసల చొప్పున పెరిగాయి. మొత్తంమీద... పెట్రోల్ ధరలు లీటరుకు రూ. 4, డీజిల్ ధర రూ. 4.10 పెరిగాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవంబరు 4 నుండి ధరలు పెరగలేదు. ఈ కాలంలో ముడిసరుకు(ముడి చమురు) ధర బ్యారెల్‌కు USD 30 అమెరికన్ డాలర్లు పెరిగింది. మార్చి 10 న ఓట్ల లెక్కింపు ముగిసిన వెంటనే రేట్ల సవరణ జరుగుతుందని భావించినప్పటికీ... ఆ ప్రక్రియ రెండు వారాలపాటు వాయిదా పడింది. దాదాపు నాలుగు నెలలకు పైగా(
137 రోజులు) విరామంలో ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా రిటైల్ ధరలో బ్యారెల్‌కు 82-120 డాలర్ల వరకు పెరుగుదల(భారీ పెరుగుదల) చోటుచేసుకుంది. కాగా... ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) దశలవారీగా ధరలను పెంచుతూ వచ్చాయి. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ గత వారంలో ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలను నిలుపుదల చేసిన నేపథ్యంలో... రాష్ట్ర రిటైలర్లు దాదాపు 2.25 బిలియన్ అమెరికన్ డాలర్ల(రూ. 19 వేల కోట్లు) ఆదాయాన్ని కోల్పోయారు. కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ ప్రకారం... చమురు కంపెనీలు ‘డీజిల్ ధరలను లీటరుకు రూ. 13.1-24.9, గ్యాసోలిన్ (పెట్రోల్)పై రూ. 10.6-22.3 చొప్పున పెంచవలసి ఉంటుంది’. బ్యారెల్ క్రూడాయిల్‌కు సగటున వంద అమెరికన్ డాలర్లు, ముడిచమురు ధర 110 అమెరికన్ డాలర్లకు పెరిగితే లీటరుకు రూ. 15-20 పెంపుదల కోసం రిటైల్ ధరలో లీటరుకు రూ. 9-12 పెరుగుదల అవసరమని క్రిసిల్ రీసెర్చ్ పేర్కొంది.
ఇవి కూడా చదవండి