పెట్రో ధరలను తగ్గించాలి

ABN , First Publish Date - 2021-06-20T05:27:04+05:30 IST

పెట్రో ధరలను తగ్గించాలి

పెట్రో ధరలను తగ్గించాలి
ఇబ్రహీంపట్నం : నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు

  • సీపీఎం జిల్లా కార్యదర్శి రాంచందర్‌ 


ఇబ్రహీంపట్నం/యాచారం/కందుకూరు/మహేశ్వరం/ చేవెళ్ల: పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు నిత్యావసరాల ధరలు తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.రాంచందర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఇబ్రహీంపట్నం చౌరస్తాలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ పోతుందన్నారు. దీని ప్రభా వంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై పెనుభారం పడుతోందని ఆందోళన వ్యకం చేశారు. కార్యక్రమంలో నాయకులు సామెల్‌, జగన్‌, శంకర్‌, ప్రకా్‌షకారత్‌, జ్యోతిబసు, సురేందర్‌, వినోద్‌, వీరేష్‌ తదితరులున్నారు. కేంద్ర  ప్రభుత్వం తక్షణమే పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. శనివారం యాచారంలో సీపీఎం కార్యకర్తలు నిరసన చేపట్టారు. కార్యక్రమంలో ధర్మన్నగూడ సర్పంచ్‌ భాషయ్య, ఉపసర్పంచ్‌ పాండుచారి, నాయకులు తదితరులున్నారు. పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం మండల కార్యదర్శి ఆర్‌.చందు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం మండల కేంద్రంలోని పెట్రోల్‌ బంక్‌ వద్ద  నిరసన తెలిపారు. అలాగే మహేశ్వరం మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఎం మండల కార్యదర్శి అలువాల రవికుమార్‌ ఆరోపించారు. కార్యక్రమంలో శేఖర్‌, శ్రీశైలం, జగన్‌, రాజు, యాదయ్య, తదితరులున్నారు. సీపీఎం చేవెళ్ల డివిజన్‌ కన్వీనర్‌ అల్లి దేవెందర్‌యాదవ్‌ ఆధ్వర్యంలో గేదెకు వినతిపత్రం అందించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖర్‌, సత్తయ్య, యాదయ్య, రాజు, తదితరులున్నారు. 

Updated Date - 2021-06-20T05:27:04+05:30 IST