పెట్రో ధరలను తగ్గించాలి

ABN , First Publish Date - 2021-10-24T04:11:37+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కట్టెల పొయ్యిపై వంటలు వండి రోడ్డుపై భోజనం చేసి నిరసన తెలిపారు.

పెట్రో ధరలను తగ్గించాలి
కామారెడ్డిలో కట్టెల పొయ్యిపై వండి భోజనాలు చేస్తున్న దృశ్యం

కామారెడ్డి, అక్టోబరు 23: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కట్టెల పొయ్యిపై వంటలు వండి రోడ్డుపై భోజనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్ర యువ జన కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మా జీ మంత్రి షబ్బీర్‌అలీ ఆదేశాల మేరకు నిత్యావసర ధరల పెంపునకు నిరసనగా యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల నడ్డి విరుస్తుందని ఆరోపించారు. రోజురోజుకూ నిత్యావసర వస్తువుల ధరల ను పెంచుతున్నాయని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిరుపేదలను విస్మరిస్తూ కార్పొరేట్‌ కంపెనీలకు పెద్దపీట వేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను పెంచి పోషిస్తూ టీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రభుత్వాలు పబ్బం గడుపుకుంటున్నాయని అన్నా రు. పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ నిత్యావసర ధరలు తగ్గించే వరకు పోరా టం చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు అతిక్‌, శంకర్‌, హనుమండ్ల రవి, జమిల్‌, నిమ్మల నర్సింలు, బాలకిషన్‌గౌడ్‌, ప్రశాంత్‌, కృష్ణ, జాకిర్‌, జీవన్‌, ఆనంద్‌, దేవేందర్‌, జగదీష్‌, హర్షద్‌, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.
సామాన్య ప్రజలపై మోయలేని భారం
బిచ్కుంద : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు పెంచడంతో సామన్య ప్రజలపై మోయలేని భారం పడుతుందని కాంగ్రెస్‌ పార్టీ యూత్‌ జిల్లా అధ్యక్షుడు ఘజు పటేల్‌ అన్నారు. శనివారం మండలంలోని రాజుల్లా గ్రామం జాతీయ రహదారిపై గల పెట్రోల్‌ పంపు వద్ద ధర్నా చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలకుల మాటల్లోనే ప్రేమ ఉందే తప్ప చేతల్లో మాత్రం కనిపించడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు సాగర్‌, యాదయ్య, అశోక్‌, మునీర్‌, భూషన్‌, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T04:11:37+05:30 IST