పెట్రో కట్‌ కట!

ABN , First Publish Date - 2022-05-29T06:43:55+05:30 IST

ఇటీవల అక్కడక్కడా బంక్‌లు మూతపడుతున్నాయి.. ఎందుకంటే సమాధానం ఉండడంలేదు..

పెట్రో కట్‌ కట!
బీపీసీఎల్‌ బంక్‌

సంక్షోభంలో పెట్రోల్‌ బంక్‌లు

మూతపడుతున్న బీపీసీ, రిలయన్స్‌

కంపెనీల నుంచి తగ్గిన సరఫరా 

క్రెడిట్‌ విధానానికి స్వస్తి

అయోమయంలో యజమానులు

31న ఆందోళనకు సన్నద్ధం



ఇటీవల అక్కడక్కడా బంక్‌లు మూతపడుతున్నాయి.. ఎందుకంటే సమాధానం ఉండడంలేదు..                ఏదో జరిగి   ఉంటుందిలే అని వినియోగదారులు పట్టించుకోవడం లేదు.. వేరొక బంక్‌లో పెట్రోల్‌ కొట్టించుకుని రయ్‌.. రయ్‌ మంటూ వెళ్లిపోతున్నారు.. ఇంతకీ అసలు కథేమిటంటే.. నష్టాలు వస్తున్నాయనే సాకుతో ఆయిల్‌ కంపెనీలు  పెట్రోల్‌ సరఫరాలో కోత పెడుతున్నాయి.. క్రెడిట్‌కు స్వస్తి పలికాయి.. క్యాష్‌ అండ్‌ క్యారీ విధానంలో సరఫరా చేస్తున్నాయి. దీంతో పలు బంక్‌ల నిర్వహణ భారంగా మారింది. ఈ కారణంతోనే బంక్‌లు మూతపడుతున్నాయి. ఇప్పటికే రిలయన్స్‌ బంక్‌లను మూసివేశారు. అక్కడక్కడా బీపీసీ, ఎస్‌ఆర్‌ బంక్‌లు మూతపడ్డాయి.  ఆయిల్‌ కంపెనీల ప్రైవేటీకరణకే ఇలా చేస్తున్నట్టు బంక్‌ల యజమానులు ఆరోపిస్తున్నారు. 


 (రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

 కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల పెట్రోల్‌ బంక్‌ల నిర్వహణ సంక్షోభంలో పడింది. ప్రభుత్వ ఆయిల్‌ కంపెనీ అయిన బీపీసీ ఇప్పటికే అనేక బంక్‌లకు సరఫరా నిలిపివేసింది. దీని వెనుక ఉన్న అంత రార్థం ఏమిటనేది అర్ధం కావడం లేదు. ఈ ఏడాది సంక్రాంతి పండగ తర్వాత నెమ్మదిగా ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మన దేశంలో కూడా అలాగే ఉం టుందని.. పెట్రోల్‌ ధర రూ.150 వరకూ చేరుకుంటుందని ఊహాగానాలు అందుకున్నాయి. అయితే పెట్రోల్‌ ధర లీటర్‌ రూ. 121 వరకూ చేరుకుని ఆగింది.మరింత పెరుగుతుందని వినియోగదారులు భయపడ్డారు.ఇటీవల ఒక్కసారిగా కేంద్రం లీటర్‌ పెట్రోల్‌పై రూ. 10లు తగ్గించింది. వినియోగదారులు ఆనందపడినా.. కంపెనీల పరిస్థితి అయోమయంగా మారింది. ఎం దుకంటే ప్రస్తుత ధరలకు అమ్మితే లీటరుకు రూ.20 వరకూ నష్టం వస్తుందని ఆయా కంపెనీలు వాదిస్తున్నాయి.ప్రభుత్వ, ప్రైవేట్‌ కంపెనీలు ఈ వాదన ప్రారం భించాయి. దీంతో బంక్‌లకు సరఫరా నిలిపివేశాయి. 

 

మూతపడుతున్న బంక్‌లు..


 పెట్రోలు బంక్‌ల నిర్వహణలో మార్పులు వచ్చాయి. డీలర్లకు పెట్రోల్‌, డీజిల్‌ అమ్మినందుకు కమీషన్‌ ఉంటుంది. కంపెనీలు ఆయా పెట్రోలు బంక్‌ల నిర్వాకులకు క్రెడిట్‌ ఇచ్చేవి. కానీ కొన్ని నెలల నుంచి క్రెడిట్‌ ఇవ్వడం లేదు. ముందుగా డబ్బు చెల్లిస్తేనే పెట్రోల్‌ ఇస్తామని కొన్ని కంపెనీలు చెబుతుంటే.. కొన్ని కంపెనీలు చాలా బంక్‌లకు సరఫరా నిలిపివేశాయి. పాత తూర్పుగోదావరి జిల్లాలో  మొత్తం 350 వరకూ ఐవోసీ, బీపీసీ, హెచ్‌పీసీ అనే ప్రభుత్వ కంపెనీల బంక్‌లు, నయాగరా(ఎస్‌ఆర్‌), రిలయన్స్‌ అనే ప్రైవేట్‌ కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుతం అన్ని కంపెనీలు క్రెడిట్‌ నిలిపివేశాయి. అందులో  బీపీసీ  కంపెనీ చాలా బంక్‌లకు సరఫరా నిలిపివేసింది. దీంతో రాజమహేంద్రవరంలో కొన్ని బంక్‌లు ఇప్పటికే మూతప డ్డాయి. ఉండ్రాజవరం మండలం కానూరులో ఎస్‌ఆర్‌ బంక్‌ మూతపడింది. రిలయన్స్‌ కంపెనీ బంక్‌లకు సరఫరా నిలిపివే యడంతో మూసివేశారు.  నయాగరాకు చెందిన ఎస్‌ఆర్‌ బంక్‌ల నిర్వహణ విచిత్రంగా ఉంది.చాలా ఎస్‌ఆర్‌ బంక్‌లకు పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా తగ్గించి మొత్తానికి కమీషన్‌ ఇవ్వడం గమనార్హం. గతే డాది లక్ష లీటర్లు అమ్మితే అందులో సగం అంటే 50 వేల లీటర్లకు రూ.1.70పైసలు వంతున ఇవ్వడం గమనార్హం. దీంతో కొందరు నెమ్మదిగా ఈ బంక్‌లను నడుపుతున్నారు. అయితే బంక్‌ల నిర్వహణ ఇబ్బంది అవుతున్నట్టు డీలర్లు చెబుతున్నారు. ఒక బంక్‌ నిర్వహణకు నెలకు రూ. 1.5లక్షల ఖర్చు అవుతుంది. పూర్తిగా పెట్రోలు అమ్మకుండా ఎలా బంక్‌లు నిర్వహించగలమని అంటున్నారు. అక్కడక్కడా పెట్రోల్‌ బంక్‌లు మూసివేయడంతో ఏం జరుగుతుందో తెలియక కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. 


 31న నిరసనకు సిద్ధమవుతున్న డీలర్లు..


ఇటీవల కేంద్రం పెట్రోలు ఎక్జైజ్‌ డ్యూటీ తగ్గించిన సంగతి తెలిసిందే.దాని వల్ల లీటరు పెట్రోలుకు రూ.10, డీజిల్‌కు రూ.6 తగ్గింది. తగ్గింపు నిర్ణయం ఆకస్మికంగా తీసుకోవడం వల్ల అప్పటికే పాత ధరకు కొనుగోలు చేసిన పెట్రోల్‌, డీజిల్‌ తక్కువ ధరకు విక్రయించాల్సి వచ్చిందని, దీని వల్ల జిల్లాలో రూ.10 కోట్ల నష్టం జరిగిందని, దీనిని కేంద్రం డీలర్లకు రీఎంబర్స్‌ చేయాలని డీలర్లు కోరుతున్నారు.  ఇప్పటికే రోజువారీ ధరల నిర్ణయం వల్ల కాస్త పెరిగినా, తగ్గినా సర్దుకుంటున్నామని, ఒకేసారి  తగ్గించడం వల్ల  తాము నష్టపోయామని చెబుతున్నారు.ఈ నెల 31న దేశవ్యాప్తంగా సుమారు 18 రాష్ర్టాల్లో ఆయిల్‌ కంపెనీల నుంచి పెట్రోల్‌ కొనుగోలు ఆపివేస్తామని అంటున్నారు. అప్పటికే ఉన్న పెట్రోలుతో బంక్‌లు మాత్రం ఆగకుండా నిర్వహిస్తామని చెబుతున్నారు.ఈ నేపఽథ్యంలో ప్రభుత్వం చర్చలకు పిలిచి, తమ సమస్యలు పరిష్కరిస్తే పర్వాలేదని, లేకపోతే తర్వాత కార్యాచరణ చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర డీలర్ల అసోసియేషన్‌ నుంచి జిల్లా కమిటీలకు సమాచారం అందింది.


Updated Date - 2022-05-29T06:43:55+05:30 IST