పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2021-06-20T04:32:51+05:30 IST

రోజూ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తక్షణమే అదుపు చేయాలని వామపక్ష పార్టీల నాయకుల డిమాండ్‌ చేశారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి
జిల్లా కేంద్రంలో నిరసన తెలుపుతున్న వామపక్ష పార్టీల నాయకులు

- వామపక్ష పార్టీల నాయకుల డిమాండ్‌

- జిల్లా వ్యాప్తంగా నిరసనలు 

వనపర్తి టౌన్‌, జూన్‌ 19: రోజూ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తక్షణమే అదుపు చేయాలని వామపక్ష పార్టీల నాయకుల డిమాండ్‌ చేశారు. శని వారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ని అంబేడ్కర్‌ విగ్రహం ముందు పెరుగుతున్న ధరల ను నియంత్రించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సం దర్భంగా  వారు మాట్లాడుతూ క్రూడాయిల్‌ ధరలు అదుపులో ఉన్నా బీజేపీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ పై పన్నులు పెంచి ప్రజలపై భారాలు మోపుతోందన్నా రు. గడిచిన 45రోజుల్లో 26సార్లు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచారని అన్నారు. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నా రు. దీనికి తోడు వంటగ్యాస్‌ ధరలు సామాన్యులను ఉ లిక్కిపడేలా చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రభు త్వ భూములు అమ్మకం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వ భూములను ప్రజా ప్రయోజనాల కోసం ఉప యోగించుకోవాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌, సీపీఐ (ఎం ఎల్‌) న్యూడెమాక్రసి జిల్లా కార్యదర్శి అరుణ్‌ కుమా ర్‌, సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి చంద్రయ్య, నాయకు లు పుట్ట ఆంజనేయులు, గోపాలకృష్ణ, కురుమయ్య, మదన్‌, రమేష్‌, గట్టయ్య, రాబర్ట్‌, నందిమల్ల రాములు, పరమేశ్వరాచారి, గంధం కురుమయ్య పాల్గొన్నారు. 

పాన్‌గల్‌లో..

 పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గిం చాలని శనివారం మండల కేంద్రంలో సీపీఎం రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వసన వ్యక్తం చేశారు. ఈ సం దర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోదండరాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ఇష్టానుసారంగా ధరలు పెంచి సామాన్యులపై భారం మోపిందన్నారు. పెరిగిన ధరలను వెంట నే తగ్గించా లని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండ ల నాయకులు వెంకటయ్య, డివైఎఫ్‌ఐ నాయకులు ఖాజాకమలాకర్‌, కురుమయ్య, శేఖరయ్య పాల్గొన్నారు.

కొత్తకోటలో..

  పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను తగ్గించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం కొత్తకోటలో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు నిక్సన్‌, నాగరాజు, ఆశన్న యా దవ్‌, శ్రీనివాసులు, వెంకటయ్య యాదవ్‌, కురుమూర్తి సాగర్‌, రాజు, వడ్డె శ్రీను, మందడి వెంకటయ్య, నాగన్న  పాల్గొన్నారు. 

 అమరచింతలో..

 అమరచింతలో వామపక్షల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఎం, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసి పార్టీలు సంయుక్తంగా కలిసి పాత బస్టాండ్‌ రోడ్డు మీద కేంద్రం అవలంభిస్తున్న ప్రజావ్య తిరేక విధానాలను ఖండిస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి జీఎస్‌. గోపి, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసి మండల కార్యదర్శి రాజు,  నాయకులు వెంకటేష్‌, రమేష్‌, భాస్కర్‌, శ్యాంసుందర్‌, రాజన్న, బుచ్చన్న, మల్లేష్‌, ఎర్రన్నలు పాల్గొన్నారు. 

ఆత్మకూరులో...

ఆత్మకూరులో వామపక్షల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఎం, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసి పార్టీలు సంయుక్తంగా కలిసి తహసీ ల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంత రం  తహసీల్దార్‌ శ్రీనివాసులకు వినతి పత్రం అందజే శారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకు లు మో ష, శ్రీహరి ప్రసాద్‌, రాబర్ట్‌, ఆంజనేయులు, కృష్ణ, భారతీయుడు, లక్ష్మీనారాయణ, బీమన్న, బాల్‌ రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వీపనగండ్లలో..

మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహాం ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతి రేక విధానాలకు సీపీఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో  సీపీఎం గ్రామ కార్యదర్శి సీహెచ్‌ వెంకటయ్య,  నాయకులు మురళి, ఆశన్న, ఈశ్వర్‌, నవీన్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2021-06-20T04:32:51+05:30 IST