పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2020-07-05T11:30:22+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని కోరుతూ శనివారం భూత్పూర్‌ తహసీల్దార్‌కు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వినతి పత్రం అందించారు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి

భూత్పూర్‌, జూలై 4: పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని కోరుతూ శనివారం భూత్పూర్‌ తహసీల్దార్‌కు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పార్టీ మం డల అధ్యక్షుడు నర్సింహారెడ్డి మాట్లాడారు. కార్య క్రమంలో పార్టీ నాయకులు హర్యానాయక్‌, గోవర్ధన్‌గౌడ్‌, ఎండీ. సాధిక్‌ పాల్గొన్నారు.


పాలమూరులో..

మహబూబ్‌నగర్‌ రూరల్‌: పెట్రోల్‌ ధరలు తగ్గించాలని మండల కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తహసీల్దార్‌ పార్థ సారథి, రూరల్‌ మండల డిప్యూటీ తహసీల్దార్‌ రాజేష్‌కు శనివారం వినతి పత్రం అందజేశారు. 


సీసీకుంటలో..

 చిన్నచింతకుంట: చిన్నచింతకుంట మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు నిరసనగా మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు తహసీల్దార్‌ కార్యాల యం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ సువర్ణరాజుకు వినతి పత్రం అందజే శారు. కార్యక్రమంలో మండల కో-ఆప్షన్‌ మైమూ ద్‌, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వెంకటేష్‌, మంగ శ్రీనివాసులు, శేఖర్‌, శేరిగౌసు పాల్గొన్నారు.


అడ్డాకులలో..

అడ్డాకుల: పెట్రోలు, డీజిల్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని కాంగ్రెస్‌ ఆధ్వ ర్యంలో శనివారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేసి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్య దర్శి విజయ మోహన్‌రెడ్డి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాగిరెడ్డి, మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బాల్‌రాజ్‌, మాజీ మండల కోఆప్షన్‌ షఫిహమ్మద్‌, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.


నవాబ్‌పేటలో..

నవాబ్‌పేట/రాజాపూర్‌: పెట్రోల్‌ ధరలను తగ్గించాలని కాంగ్రెస్‌ నాయకుడు పి.రంగారావు అన్నారు. శనివారం మండల కాంగ్రెస్‌ నాయకుల తో కలిసి తహసీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చారు. అలాగే పెట్రోల్‌ ధరలను తగ్గించాలని కోరుతూ రాజాపూర్‌ తహసీల్దార్‌ శంకర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో గోవర్ధన్‌రెడ్డి, గోనెల రమేష్‌, నసీర్‌బేగ్‌, రమణ పాల్గొన్నారు.

Updated Date - 2020-07-05T11:30:22+05:30 IST