పెళ్లికి బహుమతిగా పెట్రోల్‌, చిన్న ఉల్లి!

ABN , First Publish Date - 2021-02-19T17:47:35+05:30 IST

పెట్రోల్‌, డీజల్‌ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ..

పెళ్లికి బహుమతిగా పెట్రోల్‌, చిన్న ఉల్లి!

చెన్నై/పెరంబూర్‌ : స్థానిక మధురవాయల్‌లో జరిగిన వివాహవేడుకల్లో వధూవరులకు చిన్న ఉల్లి, పెట్రోల్‌, గ్యాస్‌ సిలిండర్‌ను స్నేహితులు బహుమతిగా అందజేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజల్‌ ధరలు భారీగా పెరుగుతున్నాయి. అదే సమయంలో ఇటీవల ఆయిల్‌ సంస్థలు వంటగ్యాస్‌ ధరను కూడా పెంచాయి. తాజాగా రాష్ట్ర మార్కెట్‌లో చిన్న ఉల్లి కిలో రూ.150కి చేరింది. ఈ నేపథ్యంలో, స్థానిక మదురవాయల్‌లో బుధవారం రాత్రి కార్తీక్‌-శరణ్యల వివాహం జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొన్న వారి స్నేహితులు 5 లీటర్ల పెట్రోల్‌, చిన్న ఉల్లితో మాలలు, వంటగ్యాస్‌ సిలిండర్‌ను బహుమతిగా అందజేశారు.

Updated Date - 2021-02-19T17:47:35+05:30 IST