చెన్నై బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి

ABN , First Publish Date - 2022-02-10T14:18:12+05:30 IST

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలోని బీజేపీ కార్యాలయంపై గురువారం తెల్లవారుజామున దుండగులు ద్విచక్ర వాహనాల్లో వచ్చి పెట్రోల్ బాంబులు విసిరారు....

చెన్నై బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి

నిందితుడి అరెస్ట్ 

చెన్నై(తమిళనాడు): తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలోని బీజేపీ కార్యాలయంపై గురువారం తెల్లవారుజామున దుండగులు ద్విచక్ర వాహనాల్లో వచ్చి పెట్రోల్ బాంబులు విసిరారు.ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు పెట్రోలు బాంబు విసిరి పోలీసులను తప్పించుకుని పారిపోయారు.‘‘మా బీజేపీ కార్యాలయంపై గురువారం తెల్లవారుజామున ఒకటిన్నర గంటలకు దుండగులు పెట్రోల్ బాంబు విసిరారు. 15 సంవత్సరాల క్రితం కూడా డీఎంకే ప్రమేయంతో ఇలాంటి సంఘటన జరిగింది. ఈ ఘటనలో తమిళనాడు ప్రభుత్వం పాత్రను మేం ఖండిస్తున్నాం... మేం పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాం.. ఇలాంటి వాటికి బీజేపీ క్యాడర్ భయపడవద్దు.’’ అని బీజేపీ నాయకుడు కరాటే త్యాగరాజన్ చెప్పారు.


 సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా చెన్నైలోని నందనం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని వినోద్‌గా గుర్తించిన పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు.ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. బీజేపీ కార్యకర్తలు కార్యాలయం బయట గుమిగూడి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Updated Date - 2022-02-10T14:18:12+05:30 IST