నిబంధనలు పాటించని బంకులపై కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-09-22T05:42:56+05:30 IST

జిల్లాలో నియమ నిబంధనలు పాటించని పెట్రోల్‌ బంకులపై పౌరసరఫరాల అధికారులు, తూనికలు కొలతల అధికారులు ఆకస్మిక

నిబంధనలు పాటించని బంకులపై కఠిన చర్యలు

కలెక్టర్‌ ఎంవీ రెడ్డి


కొత్తగూడెం కలెక్టరేట్‌, సెప్టెంబరు 21: జిల్లాలో నియమ నిబంధనలు పాటించని  పెట్రోల్‌ బంకులపై పౌరసరఫరాల అధికారులు, తూనికలు కొలతల అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎంవీ రెడ్డి  ఆదేశించారు. సోమవారం ఆయా శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు. కల్తీ నివారణకు, తూకంలో వ్యత్యాసాలను నివారించాల్సిన బాధ్యతమనపై ఉందన్నారు. కలెక్టర్‌ ఆదేశానుసారం సోమవారం పౌరసరఫాల అధికారి చంద్రప్రకాష్‌, తూనికలు కొలతల అధికారి మనోహర్‌ కొత్తగూడెంలోని శ్రీనివాస ఫిల్లింగ్‌ కేంద్రంలో తనిఖీలు నిర్వహించి నాణ్యతను, తూకాలను, రక్షణ చర్యలు పరిశీలించారు.

Updated Date - 2020-09-22T05:42:56+05:30 IST