
న్యూఢిల్లీ: దేశంలో శనివారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. కేవలం ఐదు రోజుల్లో నాలుగోసారి పెట్రో ధరలు పెరిగాయి. ఢిల్లీలో శనివారం పెట్రోల్ లీటరు ధర రూ.98.61కి, డీజిల్ లీటరు ధర రూ.89.87కు పెరిగింది.పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసలు పెరిగాయి.చమురు సంస్థలు వరుసగా పెట్రో ధరల పెంపుతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది.నాలుగు సార్లు ఇంధన ధరలను పెంచడం వల్ల పెట్రోల్, డీజిల్ లీటరుపై రూ.3.20 పెరిగింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు చమురు ధరలను కేంద్రం పెంచలేదు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముడి చమురు ధరలు బ్యారెల్ కు 30 డాలర్లు పెరిగినా,ఓట్ల కోసం కేంద్రప్రభుత్వం పెట్రో ధరలను పెంచలేదు. మార్చి 10వతేదీన ఎన్నికలు ముగిశాక వరుసగా పెట్రో ధరలను కేంద్రం పెంచుతోంది.
ఇవి కూడా చదవండి