వ్యాట్ తగ్గించాల్సిందే.. తెలంగాణలో ఆందోళనలకు బీజేపీ పిలుపు

ABN , First Publish Date - 2021-11-29T01:55:53+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని బీజేపీ ఆందోళనలకు సిద్ధమవుతోంది. డిసెంబరు 7వరకు వివిధ మోర్చాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేయాలని..

వ్యాట్ తగ్గించాల్సిందే.. తెలంగాణలో ఆందోళనలకు బీజేపీ పిలుపు

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని బీజేపీ ఆందోళనలకు సిద్ధమవుతోంది. డిసెంబరు 7వరకు వివిధ మోర్చాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళ, బుధవారం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాలు, మండల కేంద్రాల్లో ఎడ్లబండ్లపై ధర్నాలు చేయనున్నారు. డిసెంబరు ఒకటి నుంచి 7వ తేదీ వరకు వివిధ మోర్చాల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించుకుండా తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని బీజేపీ మండిపడుతోంది. ప్రధాని మోదీ పిలుపుతో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సైత‌ం వ్యాట్‌ను తగ్గించాయని.. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వ్యాట్‌ను తగ్గించాలని కమలనాథులు డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2021-11-29T01:55:53+05:30 IST