పెట్రో ధరలు పైపైకి..

ABN , First Publish Date - 2021-10-17T09:01:37+05:30 IST

పెట్రో ధరలు మరింత పైకి చేరాయి. శనివారం చమురు కంపెనీలు లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచాయి.

పెట్రో ధరలు పైపైకి..

లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంపు 

న్యూఢిల్లీ, అక్టోబరు 16: పెట్రో ధరలు మరింత పైకి చేరాయి. శనివారం చమురు కంపెనీలు లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచాయి. దీంతో వీటి ధరలు దేశవ్యాప్తంగా నూతన రికార్డు గరిష్ఠ స్థాయిలకు ఎగబాకాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర ఇంతకు ముందెన్నడూ లేని విధంగా రూ.105.49కి చేరింది. ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.111.43గా ఉంది. ముంబైలో లీటరు డీజిల్‌ ధర రూ.102.15కి, ఢిల్లీలో రూ.94.22కి చేరింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.109.73 ఉండగా.. డీజిల్‌ ధర రూ.102.80 స్థాయికి చేరింది. కాగా వరుసగా మూడు రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 35 పైసల చొప్పున పెరిగాయి. ఇక అన్ని రాష్ట్రాల రాజధానుల్లో లీటరు పెట్రోల్‌ ధర సెంచరీ మార్కు లేదా అంతకు మించి ఉంది. డజను రాష్ట్రాల్లో డీజిల్‌ ధర రూ.100 స్థాయిని తాకింది. ఇంధనాల ధరల్లో పెరుగుదల వాహనదారులపై భారాన్ని పెంచుతూనే ఉంది.

Updated Date - 2021-10-17T09:01:37+05:30 IST