Seal: పీఎఫ్ఐ కార్యాలయానికి సీలు

ABN , First Publish Date - 2022-10-02T13:05:26+05:30 IST

నగరంలోని పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ ప్రధాన కార్యాలయానికి అధికారులు సీలు వేశారు. ఆ సంస్థ విదేశాల నుంచి రూ.120 కోట్ల మేర హవాలా

Seal: పీఎఫ్ఐ కార్యాలయానికి సీలు

చెన్నై, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): నగరంలోని పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ ప్రధాన కార్యాలయానికి అధికారులు సీలు వేశారు. ఆ సంస్థ విదేశాల నుంచి రూ.120 కోట్ల మేర హవాలా సొమ్ము స్వీకరించి చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావటంతో ‘అక్టోపస్‌ ఆపరేషన్‌’ పేరిట ఎన్‌ఐఏ అధికారులు ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న ఆ సంస్థ ప్రధాన కార్యాలయాలు, సంస్థ నిర్వాహకుల నివాసాలు సహా 250 ప్రాంతాల్లో ఒకే సమయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థపై ఐదేళ్లపాటు నిషేధం ప్రకటించింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో ఆ సంస్థ కార్యాలయాలను మూసివేయడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆ మేరకు నగరంలోని పురుషవాక్కం మూక్కత్తాన్‌ వీధిలో ఉన్న ఆ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌(Greater Chennai Corporation) ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు కలిసి శనివారం ఉదయం మూసి, తలుపులకు తాళం వేసి సీలుపెట్టారు. కార్యాలయం ముందున్న సంస్థ నేమ్‌బోర్డు, జెండా, నాయకుల ఫోటోల బ్యానర్లను కార్పొరేషన్‌ సిబ్బంది తొలగించారు. సీలువేసిన ఆ కార్యాలయం వద్ద పోలీసులు కాపలా కాస్తున్నారు.

Updated Date - 2022-10-02T13:05:26+05:30 IST