PFI ను ban చేయాలి: Assam CM

ABN , First Publish Date - 2022-06-02T21:48:33+05:30 IST

కొద్ది రోజుల క్రితం అస్సాంలోని బటడ్రావాలో ఉన్న ఒక పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టింది ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(Popular Front of India) చేసిందేనని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ

PFI ను ban చేయాలి: Assam CM

గువహాటి: కొద్ది రోజుల క్రితం అస్సాంలోని బటడ్రావాలో ఉన్న ఒక పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టింది ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(Popular Front of India) చేసిందేనని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ(Assam Chief Minister Himanta Biswa Sarma) అన్నారు. అస్సాంలో చెలరేగుతున్న మత హింసలో పీఎఫ్‌ఐకి చెందిన విద్యార్థి విభాగం హస్తం ఉందని, ఈ రెండు సంస్థల్ని బ్యాన్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ‘‘పీఎఫ్‌ఐ హస్తం ఎప్పుడూ మత అల్లర్లోనే కనిపిస్తుంటుంది. తాజాగా జరిగిన బటడ్రావా ఘటనలో కూడా వారి హస్తం ఉన్నట్లు స్పష్టం తెలుస్తూనే ఉంది. అందుకే పీఎఫ్‌ఐతో పాటు దాని అనుబంధ విద్యార్థి సంస్థ సీఎఫ్ఐపై నిషేధం విధించాలని అస్సాం ప్రభుత్వం అభిప్రాయపడుతోంది’’ అని సీఎం శర్మ అన్నారు. అస్సాంను అస్థిరపరిచేందుకు పిఎఫ్‌ఐ, సిఎఫ్‌ఐ బహిరంగ కార్యకలాపాలు సాగిస్తున్నాయని, సాహిత్యాన్ని పంపిణీ చేస్తున్నాయని ఆయన అన్నారు. ఈ సంస్థల నిషేధం గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించినట్లు, కేంద్రం ఈ ప్రతిపాదనను తొందరలోనే ఆమోదిస్తుందనే విశ్వాసం తనకున్నట్లు శర్మ పేర్కొన్నారు.

Updated Date - 2022-06-02T21:48:33+05:30 IST