కరోనా అంతానికి.. వ్యాక్సిన్లు అక్కర్లేదు

ABN , First Publish Date - 2020-11-29T10:14:10+05:30 IST

కరోనా వైరస్‌ను అంతమొందించడానికి వ్యాక్సిన్ల అవసరం లేదని అమెరికా ఫార్మా కంపెనీ ఫైజర్‌ మాజీ ఉపాధ్యక్షుడు, ప్రముఖశాస్త్రవేత్త డాక్టర్‌ మైఖేల్‌ ఈడన్‌ స్పష్టం చేశారు...

కరోనా అంతానికి.. వ్యాక్సిన్లు అక్కర్లేదు

  • ఆరోగ్యవంతులకు వ్యాక్సినేషన్‌ వద్దు: 
  • ఫైజర్‌ మాజీ ఉపాధ్యక్షుడు

వాషింగ్టన్‌/జెనీవా, నవంబరు 28: కరోనా వైరస్‌ను అంతమొందించడానికి వ్యాక్సిన్ల అవసరం లేదని అమెరికా ఫార్మా కంపెనీ ఫైజర్‌ మాజీ ఉపాధ్యక్షుడు, ప్రముఖశాస్త్రవేత్త డాక్టర్‌ మైఖేల్‌ ఈడన్‌ స్పష్టం చేశారు. ఇన్ఫెక్షన్‌ ముప్పు లేని ప్రజలకు వ్యాక్సినేషన్‌ చేయాల్సిన అవసరమే లేదన్నారు. మనుషులపై విస్తృత ప్రయోగ పరీక్షలను పూర్తిచేసుకోని వ్యాక్సిన్లను కోట్లాది మంది ఆరోగ్యవంతులైన ప్రజలకు అందించాలన్న ఆలోచన సరికాదన్నారు. కరోనా పరీక్షలను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించిన దేశాల్లో ఇన్ఫెక్షన్లు చాలా సులువుగా అదుపులోకి వచ్చాయని గుర్తు చేశారు. కొవిడ్‌ కేసులు, మరణాల్లో దాదాపు సగం 4 దేశాలవేనని ఆయన తెలిపారు. స్థూలంగా పరిశీలిస్తే 70శాతం కేసులు, మరణాలు 10 దేశాల్లోనే నమోదవుతున్నాయని చెప్పారు.


Updated Date - 2020-11-29T10:14:10+05:30 IST