పీజీ కళాశాల ఏర్పాటుకు కృషి

Jun 17 2021 @ 00:58AM
నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వసతులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, యూనివర్సిటీ అధికారులు

డిగ్రీ కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది, కేయూ ప్రొఫెసర్లు

నర్సంపేట, జూన్‌ 16 : కాకతీయ యూనివర్సిటీ పీజీ కళాశాలను ఏర్పాటు చేసేందుకు నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బుధవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో పాటు యూనివర్సిటీ అధికారులు, ప్రొఫెసర్లు సందర్శించారు. యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు ప్రొఫెసర్‌ మల్లారెడ్డి, ప్రిన్సిపాల్‌, యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజి పాలక మండలి సభ్యులు వరలక్ష్మి, యూనివర్సిటీ కామర్స్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపాల్‌ ఫ్రయ్‌కుమార్‌, స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ చంద్రమౌళి, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి కళాశాల తరగతి గదులు, ఆవరణను పరిశీలించి సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్య కోసం నర్సంపేటకు వస్తుంటారని అధికారులకు ఎమ్మెల్యే వివరించారు. పీజీ కళాశాల లేకపోవడం లోటుగా ఉందన్నారు. పీజీ కళాశాలకు అవసరమైన స్థలం, భవనాలు, ప్రయోగశాల తదితర సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నర్సంపేటను ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు డాక్టర్‌ మదన్‌కుమార్‌, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ బత్తిని చం ద్రమౌళి, అధ్యాపకులు రమేశ్‌, శ్రీనాఽథ్‌, సుమతి, లఖన్‌, ప్రసూన, సత్యనారాయణ, కుమారస్వామి, త్యాగయ్య, ఏవో స్వరూప పాల్గొన్నారు. 

Follow Us on: