దివ్యాంగులపై వివక్ష వీడాలి

ABN , First Publish Date - 2020-12-04T05:01:03+05:30 IST

ప్రతి ఒక్కరూ దివ్యాంగులపై వివక్ష వీడాలని డీడబ్ల్యూవో నర్సింహారావు అన్నారు.

దివ్యాంగులపై వివక్ష వీడాలి
సూర్యాపేటలో జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న డీడబ్ల్యూవో నర్సింహారావు

సూర్యాపేట, డిసెంబరు 3 : ప్రతి ఒక్కరూ దివ్యాంగులపై వివక్ష వీడాలని డీడబ్ల్యూవో నర్సింహారావు అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అపూర్వ దివ్యాంగుల రెసిడెన్షియల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని గురవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం దివ్యాంగులకు మాస్క్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఈఆర్‌డీ ప్రధాన కార్యదర్శి మదనాచారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక సంక్షమ శాఖను ఏర్పాటు చేయాలని దివ్యాంగ హక్కుల పోరాట సమితి జిల్లా ఇన్‌చార్జి చింత సతీష్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. 


హుజూర్‌నగర్‌లో మెప్మా ఆధ్వర్యంలో దివ్యాంగులకు రుణాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అర్చనారవి, కమిషనర్‌ గోపయ్య, వైస్‌చైర్మన్‌ జక్కుల నాగేశ్వరరావ, వీరయ్య, సంపత్‌రెడ్డి, శ్రావణ్‌ పాల్గొన్నారు. భవిత కేంద్రంలో దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు.  


కోదాడ మండలం తమ్మరలో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా  కేక్‌కట్‌ చేశారు. రాధాకృష్ణ మానసిక దివ్యాంగుల కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు శనగల జగన్మోహన్‌, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా చిమిర్యాలలో ఐసీఐసీఐ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హక్కులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సంస్థ డీవో ఎస్‌.మారుతి, సీఎ్‌ఫలు గోపయ్య, కిరణ్‌ పాల్గొన్నారు. 


మునగాల మండలంలో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సత్యమేవ జయతే సేవా సమితి ఆధ్వర్యంలో రాధాకృష్ణ దివ్యాంగుల ఆశ్రమంతో పాటు ముకుందాపురం గ్రామంలోని విజయమ్మ వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో సమితి వ్యవ స్థాపకులు నాదెళ్ళ సత్యఅనంతలక్ష్మి, బాలక్రిష్ణ, సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:01:03+05:30 IST