పీహెచ్‌సీని సందర్శించిన కేంద్రబృందం

ABN , First Publish Date - 2022-07-02T06:44:04+05:30 IST

దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కేంద్ర వైద్యారోగ్యశాఖ బృందం శుక్రవారం సందర్శించింది.

పీహెచ్‌సీని సందర్శించిన కేంద్రబృందం
వివరాలు సేకరిస్తున్న కేంద్రబృందం

పీహెచ్‌సీని సందర్శించిన కేంద్రబృందం

దుమ్ముగూడెం, జూలై 1: దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కేంద్ర వైద్యారోగ్యశాఖ బృందం శుక్రవారం సందర్శించింది. కుటుంబ నియంత్రణపై అవగాహన కల్గించి, బిడ్డకు-బిడ్డకు మూడేళ్ల ఎడ బాటు ఉండేలా చూడాలన్నారు. గర్భిణుల నమోదు తేదీ నుంచి కాన్పు అయ్యే వరకూ సిబ్బంది సకా లంలో వైద్యసేవలందించాలని సూచించారు. బర్త్‌వెయిటింగ్‌ రూంను పరిశీలించి అందుతున్న వైద్య సేవల గురించి గర్భిణీలను అడిగి తెలుసుకున్నారు. మాతాశిశుసంరక్షణ, కుటుంబనియంత్రణ, కా న్పుల వివరాలు, వైద్యసేవలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డాక్టర్స్‌ డే సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు డాక్టర్‌ సిక్థర్‌, డాప్రియాంక, డాక్టర్‌ పద్మజ, రాష్ట్ర ఉన్నతాధికారులు డాక్టర్‌ పద్మజ, డాక్టర్‌ శ్రీదేవి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ దయానం దస్వా మి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్‌కుమార్‌, డాక్టర్‌ సుజాత, డాక్టర్‌ బాలాజీనాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T06:44:04+05:30 IST