అర్థశాస్త్ర విభాగంలో విద్యార్థినికి పీహెచ్‌డీ

ABN , First Publish Date - 2020-11-27T05:56:03+05:30 IST

టీయూ అర్థశాస్త్ర విభాగంలో డాక్టర్‌ పున్నయ్య పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థిని సౌందర్య పీహెచ్‌డీ అందుకున్నారు.

అర్థశాస్త్ర విభాగంలో విద్యార్థినికి పీహెచ్‌డీ

డిచ్‌పల్లి, నవంబరు 26: టీయూ అర్థశాస్త్ర విభాగంలో డాక్టర్‌ పున్నయ్య పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థిని సౌందర్య పీహెచ్‌డీ అందుకున్నారు. గురువారం ఆన్‌లైన్‌లో సౌం దర్య ప్రపంచీకరణ నేపథ్యంలో ‘రైతుల ఆత్మహత్యలు’ అనే సిద్ధంత గ్రంథానికి ఆన్‌లైన్‌లో నిర్వహించిన పీహెచ్‌డీ వైవా కార్యక్రమానికి బెంగళూరు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ రా మాంజనేయులు, ఎక్స్‌టర్నల్‌ ఎక్సామినర్‌గా సోషల్‌ సైన్స్‌ డీన్‌ ఆచార్య శివశంకర్‌ హాజరై సౌందర్యను అభినందించారు. పరిశోధక విద్యార్థిని ప్రపంచీకరణలో భాగంగా వ్యవసాయ రంగంలో భారీగా పెరిగిన ఉత్పత్తి ఖర్చులు, నకిలీ విత్తనా లు, నకిలీ పురుగు మందులు, రైతులను సంక్షభంలో నెట్టా యని, చీడపీడలతో కొంత పంట నష్టం రాగా మిగిలిన పం టలకుమద్దతు ధర లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రై తులు అప్పులు చేస్తున్నరని, అప్పులు ప్రత్రీ ఏటా పెరిగి కొ త్త అప్పు దొరకక కుటుంబం వీధిన పడి అవమానాలు భ రించలేక రైతులు హత్మహత్యలు చేసుకుంటున్నట్లు తన ప రిశోధనలో వెల్లడైందని విద్యార్థిని సౌందర్య వివరించారు. ప్ర భుత్వం వ్యవసాయ రంగం పరిశ్రమగా గుర్తించి తగిన వి ధంగా భీమా వర్తింప జేసి రైతులను ఆదుకోవాలని ఆమె సూచించారు. కార్యక్ర మానికి విభాగధిపతి వెంకటేశ్వర్లు,  పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ పాత నాగరాజు, సమన్వ యం చేశారు. యూనివర్సిటీ కళాశాల  ప్రన్సిపాల్‌ వాసం చంద్రశేఖర్‌, డాక్టర్‌ రవీందర్‌ రెడ్డి, స్వప్న, జాన్‌సన్‌, సంపత్‌, శ్రీనివాస్‌, దత్తద్రి, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-27T05:56:03+05:30 IST