భారతీయ కుర్రాడిని ప్రేమించిన విదేశీ యువతి.. ప్రత్యేక వీసా తీసుకుని మరీ భారత్‌కు వచ్చి హిందూ ఆచారం ప్రకారం పెళ్లి..

ABN , First Publish Date - 2022-05-21T00:41:25+05:30 IST

ఆమేమో ఫిలిప్పీన్స్‌కు చెందిన వనిత. అతడేమో భారతీయుడు. అయితే.. ప్రేమకు పరిమితులు ఉండవని రుజువు చేస్తూ వారిద్దరూ ఇటీవలే వివాహ బంధంలో ఒక్కటయ్యారు.

భారతీయ కుర్రాడిని ప్రేమించిన విదేశీ యువతి.. ప్రత్యేక వీసా తీసుకుని మరీ భారత్‌కు వచ్చి హిందూ ఆచారం ప్రకారం పెళ్లి..

ఎన్నారై డెస్క్: ఆమేమో ఫిలిప్పీన్స్‌కు చెందిన వనిత. అతడేమో భారతీయుడు. అయితే.. ప్రేమకు పరిమితులు  ఉండవని రుజువు చేస్తూ వారిద్దరూ ఇటీవలే వివాహ బంధంలో ఒక్కటయ్యారు. బిహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్ జిల్లాలో ఇటీవల జరిగిన ఈ వివాహం స్థానికుల్లో పెద్ద చర్చకే దారి తీసింది. బాత్రా గ్రామానికి చెందిన ధీరజ్ ప్రసాద్ ఫిలిప్పీన్స్‌లోని ఓ హోటల్‌లో మేనేజర్‌. అక్కడ ఉండగానే అతడు వేలుమ్ దుమ్రా అనే యువతితో ప్రేమలో పడ్డాడు. వేలుమ్ మార్కెటింగ్ డీలర్‌గా పనిచేస్తుంటారు. ఆ తరువాత వారు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. 


మే 18న వరుడి స్వగ్రామంలో అంగరంగ వైభవంగా ఈ జంట వివాహం జరిగింది. వేలుమ్.. ప్రత్యేక వీసాపై భారత్‌కు వచ్చారు. ఆమె తల్లిదండ్రులకు వీసా రాకపోవడంతో ఆమె ఒంటిరిగానే భారత్‌కు రావాల్సి వచ్చింది. హిందీ రాకపోయినా, భారత సంస్కృతి సంప్రదాయాలతో ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా మనసుపడ్డ వాడినే ఆమె మనువాడింది. ఇక.. వీరి వివాహం కారణంగా గ్రామస్తుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 



Updated Date - 2022-05-21T00:41:25+05:30 IST