భౌతికదూరం పాటించాలి

ABN , First Publish Date - 2021-04-24T03:37:19+05:30 IST

ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటించాలని, ఆరోగ్య కేంద్రాలలో టీకాలను వేసుకోవాలని భీంపూర్‌ మండల ప్ర త్యేక అధికారి గోపికృష్ణ సూచించారు. శుక్రవారం ధన్నోరా గ్రామం లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. భీంపూర్‌, గోనా గ్రా మాల్లో ప్రకృతి వనాలు, వైకుంఠధామాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాక్సినేష న్‌ కోసం స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నా రు.

భౌతికదూరం పాటించాలి
పిప్పల్‌కోటిలో నిర్మానుష్యంగా మారిన వీధులు

భీంపూర్‌, ఏప్రిల్‌23: ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటించాలని, ఆరోగ్య కేంద్రాలలో టీకాలను వేసుకోవాలని భీంపూర్‌ మండల ప్ర త్యేక అధికారి గోపికృష్ణ సూచించారు. శుక్రవారం ధన్నోరా గ్రామం లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. భీంపూర్‌, గోనా గ్రా మాల్లో ప్రకృతి వనాలు, వైకుంఠధామాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాక్సినేష న్‌ కోసం స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నా రు. ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో వినోద్‌, సర్పంచ్‌లు, బాదర్‌, బి క్కి అజయ్‌, మడావి లింబాజి తదితరులు పాల్గొన్నారు. రెండో దశ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు పది లంగా ఉండాలని ఎస్సై ఎండీ అరీఫ్‌ అన్నారు. శుక్రవారం గోన శి వారు ప్రాంతాల్లో మాస్కు ధరించని వారిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు 120 మంది పైన కేసులు నమోదు చేశామన్నారు. 45 ఏళ్ల వారు టీకాలు వేసుకోవాలన్నారు.

పిప్పల్‌కోటిలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పిప్పల్‌కోటి గ్రామంలో శుక్ర వారం నుంచి వారంపాటు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటిస్తున్నట్లు వైస్‌ ఎంపీపీ గడ్డంలస్మన్న, సర్పంచ్‌ కేమకళ్యాణి గంగయ్య తెలిపారు. దుకాణాలు, కటింగ్‌ షాప్‌, హోటల్‌లు మూసి వేయడంతో వీధులు నిర్మానుష్యంగా కనిపించాయి. లాక్‌డౌన్‌ వారం రోజుల పాటు ఉం టుందన్నారు. గ్రామస్థులు చేతులకు శానిటైజర్‌తో శుభ్రం చేసుకో వాలని, మాస్కులను వాడాలని, భౌతికదూరం పాటించాలని కోరా రు. అంతకు ముందు వీధుల గుండా శానిటేషన్‌ చేశారు.

ద్రావణం పిచికారీ

బోథ్‌ : మండల కేంద్రంలో శుక్రవారం శానిటైజర్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలో కేసులు పెరుగుతుండడంతో ఈ కార్యక్రమా న్ని చేపట్టినట్లు సర్పంచ్‌ సురేందర్‌యాదవ్‌ తెలిపారు. ప్రజలంద రూ అప్రమత్తంగా ఉండి మాస్కులు ధరించాలని అన్నారు. భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. ఒకటో తేదీ నుంచి జూని యర్‌ కళాశాలను క్వారంటైన్‌ కేంద్రంగా వాడుకునేందుకు నిర్ణ యం తీసుకోవడం జరిగిందన్నారు. పట్టణంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని షాపులను తెరిచి ఉం చాల ని తీర్మానించామని తెలిపారు. 

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులను, కొవిడ్‌ మరణాలను దృష్టిలో ఉంచుకొని మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ ఆధ్వర్యంలో వైరస్‌ నివారణకు శుక్రవారం ఆయా కాల నీల్లో ద్రావణాన్ని పిచికారీ చేపట్టారు. మహాలక్ష్మివాడతో పాటు తా టిగూడ, క్రాంతినగర్‌ తదితర ప్రాంతాల్లో ద్రావణం పిచికారీ చే యించి వార్డు కౌన్సిలర్లతో మాట్లాడి వైరస్‌నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

వార్డుల్లో కరోనా కట్టడి కౌన్సిలర్లదే బాధ్యత

ఆదిలాబాద్‌అర్బన్‌: కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యం వార్డుల్లో కట్టడి చేసే బాధ్యత పూర్తిగా కౌన్సిలర్లే తీసుకోవాలని ము న్సిపల్‌ చైర్మన్‌ జోగుప్రేమేందర్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని తన వార్డులో ఇంటింటికీ తిరుగు హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పి చికారీ చేయించారు. ఈ సందర్భంగా ప్రతీ ఇంటికి తిరుగుతూ రకకొవిడ్‌ నిబంధనలు పాటించాలని అన్నారు. ప్రతీఒక్కరు మాస్కు లు ధరించి భౌతికదూరం పాటించాలని, శానిటైజర్‌ ఉపయోగించా లని సూచించారు. జిల్లా కేంద్రంలో రోజు రోజుకు గతంలో కంటే రెట్టింపు కరోనా కేసులు బయటకొస్తున్నాయన్నారు. దీనిని నియం త్రించే బాధ్యత పూర్తిగా వార్డు కౌన్సిలర్లపైనే ఉందని స్వీయ ని యంత్రణ తప్పకుండా పాటించాలని సూచించారు. ప్రభుత్వం విధించిన రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కొనసాగిస్తు న్న కర్ఫ్యూ ప్రజలు, కౌన్సిలర్లు సహకరించాలని కోరారు. 

నర్సాపూర్‌లో మాస్కుల పంపిణీ 

ఉట్నూర్‌: నర్సాపూర్‌ (బి) గ్రామంలో ఫ్యూచర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాస్కులను సర్పంచ్‌ పెందూర్‌ కళావతిబండు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీఒక్కరు వైరస్‌ను ప్రబలకుండా చూడా లని తెలిపారు. ప్రజలందరూ తప్పకుండా మాస్కులు ధరించాలని కోరారు. స్వచ్ఛంద సంస్థలు ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక సౌకర్యాలు కల్పించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మ డావి అజయ్‌, మరప రామారావు, విజయ్‌ పాల్గొన్నారు. 

అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలి.

సిరికొండ: కేసులు పెరుగుతున్న దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో నే బయటకు రావాలని, అనవసరంగా బయటకు వచ్చి కరోనా బారిన పడవద్దని తహసీల్దార్‌ సర్పరాజ్‌ నవాజ్‌ అన్నారు. శుక్రవా రం వివిధ గ్రామాల్లో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్వచ్ఛందంగా లా క్‌డౌన్‌ పాటించాలన్నారు. ప్రజలు కచ్చితంగా మాస్కులు ధరించి బయటకు రావాలని, భౌతిక దూరం పాటిస్తూ వైరస్‌ వ్యాప్తిని అ రికట్టాలని అన్నారు. కొండాపూర్‌లోని ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేపడుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆర్‌ఐ యజ్వెందర్‌ రెడ్డి, ఏపీవో  సుభాషిణి, సీనియర్‌ అసిస్టెంట్‌ సుధాకర్‌, రెడ్‌ క్రాస్‌ సొసైటీ మం డల కో-ఆర్డినేటర్‌ స్వామి పాల్గొన్నారు.  సిరికొండ పంచాయతీలో, కొండాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో శుక్రవారం వైద్యసి బ్బంది మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేశారు. 20 మందికి కరోనా ప రీక్షలు చేయగా, ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు సిబ్బంది తెలిపారు.

Updated Date - 2021-04-24T03:37:19+05:30 IST