ఏజెన్సీలోని వైద్యుల పోస్టులను ఆదివాసీలతో భర్తీచేయాలి

ABN , First Publish Date - 2021-06-22T04:51:12+05:30 IST

ఏజెన్సీ ప్రాంతంలోని వైద్యశాఖలో వైద్యసిబ్బందిని ఆదివాసీ అభ్యర్థులతోనే భర్తీచేయాలని ఉట్నూర్‌లో సోమవారం ఆదివాసీ నాయకులు ఐటీడీఏ పీవో భావేశ్‌మిశ్రాకు వినతి పత్రం ఇచ్చారు.

ఏజెన్సీలోని వైద్యుల పోస్టులను ఆదివాసీలతో భర్తీచేయాలి
ఐటీడీఏ పీవో భావేష్‌ మిశ్రాకు వినతిపత్రం ఇస్తున్న ఆదివాసీ నాయకులు

సిర్పూర్‌(యు), జూన్‌ 21: ఏజెన్సీ ప్రాంతంలోని వైద్యశాఖలో వైద్యసిబ్బందిని ఆదివాసీ అభ్యర్థులతోనే భర్తీచేయాలని ఉట్నూర్‌లో సోమవారం ఆదివాసీ నాయకులు ఐటీడీఏ పీవో భావేశ్‌మిశ్రాకు వినతి పత్రం ఇచ్చారు. ఆదివాసీలకు భారత రాజ్యంగా కల్పిం చిన చట్టలను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. అదేవిధంగా ఏజేన్సీ ప్రాంతంలో పెసా చట్టం,1ఆఫ్‌70 చట్టాలకు  వ్యతరేకంగా పనులు కొన సాగుతున్నాయన్నారు. కుమ్రంభీం, ఆదిలాబాద్‌ జిల్లా ల్లోని ఏజేన్సీ ప్రాంతంలో గల వివిధ గ్రామాల్లో గిరిజ నేతరులు గిరిజన చట్టాలను ఉల్లం ఘిస్తూ విచ్చల విడిగా భవనాలు నిర్మిస్తున్నారన్నారు. గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆది వాసీమిత్ర వెల్ఫేర్‌ సొసైటీ జిల్లాకో ఆర్డి నేటర్‌ అడ వేంకటేష్‌, ఉమ్మడి జిల్లా రాయిసెం టర్‌ సర్‌మేడి మెస్రం దుర్గు, పెందోర్‌ భరత్‌, గెడం జంగు, పుర్క బాపురావు, కోరెంగ లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T04:51:12+05:30 IST