వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలి

Jun 16 2021 @ 23:42PM
సిద్ధాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులను అడిగి వివరాలు తెలుసుకుంటున్న ఎంపీ రాములు

- సిద్దాపూర్‌ పీహెచ్‌సీని తనిఖీ చేసిన ఎంపీ రాములు అచ్చంపేట అర్బన్‌, జూన్‌ 16 : ఆసుపత్రుల్లో వైద్యులు రోగులకు అందు బాటులో ఉండి వైద్యం అందించాలని నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు నియోజక వర్గ సభ్యులు పి.రాములు అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఏజెన్సీ గ్రామమైన సిద్ధాపూర్‌ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 74 గ్రామా లు 82వేల మంది ప్రజలు ఉన్నారని, వైద్యులు 24గంటలు రోగులకు అందు బాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారి చందూలాల్‌కు సూచించారు. వైద్యులు, వైద్యసిబ్బంది ఉండేందుకు క్వార్టర్స్‌ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటా మన్నారు. ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న వైద్యాధి కారి కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారని, రెగ్యులర్‌ వైద్యులను నియ మించాలని డీఎంఅండ్‌ హెచ్‌ఓ సుధాకర్‌లాల్‌తో ఫోన్‌లో మాట్లాడ నని అన్నారు. యునాని ఆసుపత్రిని యథావిధిగా నడిపించాలని సూచించారు. అనంతరం మండల పరిధిలోని అక్కారం గ్రామంలో సీనియర్‌ నాయకుడు శ్రీనివాసురెడ్డి మృతి చెందగా కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడి నుంచి ఘణపూర్‌ గ్రామం మీదుగా వెళ్తుండగా ఓ పొలంలో రైతులు పత్తి విత్త నాలు వేస్తుండగా ఎంపీ కొద్దిసేపు గుంటుక కొట్టారు. రైతు బంధు డబ్బులు మీ ఖాతాల్లో పడ్డాయా అని ఆ రైతులను అడిగి తెలుసుకున్నారు.ఘనపూర్‌ గ్రామంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అక్కడి నుంచి మన్నెవారిపల్లి గ్రామానికి వచ్చిన ఎంపీతో నక్కలగండి రిజర్వార్‌ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు వచ్చి ఇప్పటి వరకు పరిహారం డబ్బులు రాలేదని గోడు వినిపించారు. భూములు కోల్పోయిన రైతులకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఆర్‌ఆండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇస్తామని మాట ఇచ్చారని వారుగుర్తు చేయగా, ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని రాములు తెలిపారు. 

Follow Us on: