విద్యార్థులకు ఫిజియోథెరపీ సేవలు

ABN , First Publish Date - 2021-10-26T05:12:30+05:30 IST

విద్యార్థులకు ఫిజియోథెరపీ సేవలు

విద్యార్థులకు ఫిజియోథెరపీ సేవలు

డీఈవో డి.వాసంతి 


 వరంగల్‌ కలెక్టరేట్‌, అక్టోబరు 25: దివ్యాంగ విద్యార్థులకు వారంలో ఒక రోజు ఉచితంగా ఫిజియోథెరపీ సేవలు అందించనున్నామని డీఈవో డి.వాసంతి అన్నారు. సోమవారం ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలో ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్ర సమగ్ర శిక్షణ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మండల విద్యా వనరుల కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 18 ఏళ్లలోపు వారిలో చలన వైకల్యం, కండర క్షీణత, పక్షవాతం, నరాల బలహీనత తదితర వాటితో బాధపడుతున్న విద్యార్థులకు ఫిజియోథెరపీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దివ్యాంగుల తల్లిదండ్రులు ఫిజియోథెరఫి సేవలకు ఆయా మండలాల్లోని విద్యాశాఖ రిసోర్స్‌ పర్సన్స్‌ను సంప్రదించి సేవలను వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో సోమవారం చెన్నారావుపేట, నర్సంపేట, వరంగల్‌, మంగళవారం నెక్కొండ, పర్వతగిరి, బుధవారం నల్లబెల్లి, గీసుగొండ, దుగ్గొండి, గురువారం సంగెం, రాయపర్తి, శుక్రవారం ఖానాపూర్‌, వర్ధన్నపేట మండలాల్లో సేవలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-26T05:12:30+05:30 IST