కుక్క దాహం తీర్చిన పోలీసు.. ఫోటో వైరల్

May 9 2021 @ 17:50PM

ఇంటర్నెట్ డెస్క్: కరోనా కల్లోలంలో నిద్రాహారాలు మాని ప్రజా సేవ చేస్తున్నారు పోలీసులు. పగలనకా రాత్రనకా వీధుల్లో కాపలా కాస్తూ నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఓ పోలీసు తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఓ వీధి కుక్క దాహం తీర్చి తనలోని మానవత్వాన్ని చాటి చెప్పాడు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోను షామ్లి ఎస్పీ సుకీర్తి మాధవ్ మిశ్రా ట్విటర్‌లో షేర్ చేశారు. దీనిని వారాణసిలో తీసినట్లు ఎస్పీ చెప్పారు. అంతేకాదు ఈ ఫోటోకు ‘ఓ శునకం మనిషిని ప్రేమిస్తోందంటే.. ఆ వ్యక్తి మంచివాడని అర్థం’ అంటూ సదరు పోలీసును ప్రశంసించారు. ఈ ఫోటోలో ఓ బోరింగు పంపు పక్కన ఉన్న పోలీసు బోరింగ్ కొడుతుంటే.. ఓ వీధికుక్క ఆ నీళ్లు తాగుతుండడాన్ని గమనించవచ్చు.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...