డాక్టర్‌ను హత్తుకున్న 75 ఏళ్ల బామ్మ.. ఫొటో వైరల్!

May 7 2021 @ 16:24PM

ప్రస్తుతం దేశాన్ని కరోనా అతలాకుతలం చేస్తున్న వేళ వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారు. ఎంతో మందికి చికిత్స చేసి కోలుకునేలా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ నుంచి కోలుకున్న బెంగాల్‌కు చెందిన ఓ 75 ఏళ్ల బామ్మ పీపీఈ కిట్‌లో ఉన్న డాక్టర్‌ను హత్తుకుని తన కృతజ్ఞతను తెలియజేసింది. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


`పది రోజులు కోవిడ్‌తో యుద్ధం చేసిన 75 ఏళ్ల మహిళ ఎట్టకేలకు కోలుకుంది. ఇంటికి వెళుతున్న సమయంలో తనకు వైద్యం చేసిన డాక్టర్‌ను మనస్ఫూర్తిగా గుండెలకు హత్తుకుంది. అతడిని మనసారా దీవించింద`ని ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఎన్నో మాటలు చెప్పలేని విషయాలను ఈ ఫొటో చెబుతోందని పేర్కొన్నాడు. 

Follow Us on:

జాతీయంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.