రోజూ తల్లిని కొడుతున్న తండ్రి.. భరించలేక ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టిన 9 ఏళ్ల కొడుకు.. కథ ఎందాక వెళ్లిందంటే..

Sep 26 2021 @ 13:13PM

బిహార్: అతనొక బడి పంతులు.. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత స్థానాలకు చేర్చాల్సిన అతడు ఆ విషయాన్ని మర్చిపోయి తన 9 ఏళ్ల కొడుకు ముందే భార్యను ప్రతిరోజూ గొడ్డును బాదినట్లు బాధేవాడు. ఇదంతా చూస్తు ఆ బాలుడు తీవ్రమనస్తాపానికి గురయ్యేవాడు. ఓ రోజు ఆ బాలుడు తీసిన ఫోటో అతడి తల్లి బాధను తగ్గించి, తండ్రిని కటకటాల పాలుచేసింది. బిహార్‌లోని ముఫసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..


బధారా గ్రామానికి చెందిన ఫూల్ కుమార్ అనే వ్యక్తి దుర్గాపూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. జయప్రకాష్ నగర్‌లోని మిశ్రా భవన్‌లో తన భార్య, కొడుకుతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అయితే ఇంట్లో సమస్యల కారణంగా భార్య, భర్తలు తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో కుమార్ ప్రతిరోజు భార్యపై దాడి చేసేవాడు. దీంతో విసిగిపోయిన ఆమె.. శనివారం రహస్యంగా వెళ్లి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు ఆమె ఫిర్యాదును పట్టించుకోలేదు.

భార్య స్టేషన్‌కు వెళ్లిన విషయం తెలిసి భర్త శనివారం రాత్రి ఆమెను చావ బాదాడు. తల్లిని ఆ స్థితిలో చూసి కొడుకు మనసు కలిచివేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. ఆమె తల్లిపై తండ్రి చేస్తున్న దాడిని ఫొటో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ ఫొటో వైరలయింది. విషయం తెలిసి రంగంలోకి దిగిన డీఎం, ఎస్పీ వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి కుమార్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నామన్నారు.

Follow Us on:

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.