ఒడ్డుకు వింతజీవి కళేబరం.. వైరల్ అవుతున్న ఫోటోలు

ABN , First Publish Date - 2021-02-20T23:04:21+05:30 IST

సింగపూర్‌లోని ఓ రిజర్వాయర్ ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఓ విచిత్రపు జీవి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పెద్ద దవడలు, పళ్లతో భయానకంగా ఉన్న ఈ జీవి కళేబరాన్ని చూసిన వారు వెంటనే ఫోటోలు..

ఒడ్డుకు వింతజీవి కళేబరం.. వైరల్ అవుతున్న ఫోటోలు

ఇంటర్నెట్ డెస్క్: సింగపూర్‌లోని ఓ రిజర్వాయర్ ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఓ విచిత్రపు జీవి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పెద్ద దవడలు, పళ్లతో భయానకంగా ఉన్న ఈ జీవి కళేబరాన్ని చూసిన వారు వెంటనే ఫోటోలు తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తున్నారు. సింగపూర్‌లోని సముద్రపు ఒడ్డున ఈ వింత జీవి కళేబరం బయటపడింది. మొదటగా కరెన్ లిథ్‌గో అనే వ్యక్తి దీనిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘దీనిని చూస్తుంటే ఎప్పుడో అంతరించిపోయిన జీవిలా కనిపిస్తోంది’ అంటూ రాసుకొచ్చారు.


దీనిని పరిశీలించిన అధికారులు ఇది వింత జీవి కాదని, ఇదో రకం చేప అని అంటున్నారు. ‘దీని పేరు అలిగేటర్ గార్. గార్ కుటుంబానికి చెందిన జీవుల్లో ఇది అతి పెద్ద చేప అని చెబుతున్నారు. ఇది మంచినీటిలో జీవించే అతి పెద్ద చేప అని చెప్పిన అధికారులు.. ఈ జాతి చేపలు ఎక్కువగా దక్షిణ అమెరికా ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు. దీనిని ఎవరైనా అక్రమంగా ఇక్కడకు తెచ్చి వదిలి ఉంటారని అభిప్రాయపడుతున్నారు.

Read more